తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్​ స్పెషల్ గెస్చర్​ - 'అలా చేయడానికి వాళ్లే కారణం - ఆ ఇద్దరి కోసమే అదంతా!' - ABHISHEK SHARMA INDIA VS ENGLAND

వారిద్దరి కోసమ అలా చేశాను - విక్టరీ సెలబ్రేషన్స్​లో అభిషేక్ శర్మ

Abhishek Sharma IND Vs ENG
Abhishek Sharma (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 23, 2025, 10:10 AM IST

Abhishek Sharma India Vs England : కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా చెలరేగిపోయింది. ముఖ్యంగా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్​లో విశ్వరూపం చూపించాడు. 79 పరుగులు స్కోర్ చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో భారత్ కేవలం 12.5 ఓవర్లలోనే ఇంగ్లీష్​ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.

అయితే 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన అభిషేక్​ తన సంబరాలను డిఫరెంట్​గా చేసుకున్నాడు. బొటనవేలు, చూపుడు వేలును ఎల్​ (L) షేప్​లో పైకి చూపిస్తూ అభివాదం చేశాడు. దీంతో అతడు ఎందుకు ఇలా చేశాడంటూ అభిమానుల్లో నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు. అయితే అలా చేయడానికి గల కారణాన్ని మ్యాచ్‌ తర్వాత అభిషేక్ స్వయంగా వెల్లడించాడు.

"ఈ మ్యాచ్‌లో నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవడానికి మరోసారి ట్రై చేశాను. హాఫ్ సెంచరీ సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అర్ధశతకం తర్వాత అలాంటి గెస్చర్​ చేయడానికి ఓ కారణం ఉంది. అది నా కోచ్, కెప్టెన్‌ కోసమే చేశాను. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​, హెడ్ కోచ్ గంభీర్, మాకు ఫుల్​ సపోర్ట్ ఇచ్చారు. యంగ్ క్రికెటర్లతో వారు మాట్లాడే తీరు చాలా బాగుంటుంది. ఈడెన్ గార్డెన్స్‌ పిచ్ కూడా బాగుంది. ఫస్ట్ మా బౌలర్లందరూ చాలా అద్భుతంగా బాల్స్ వేశారు. ఈ పిచ్‌పై 160 - 170 రన్స్​ మధ్య టార్గెట్‌ ఉంటుందని నేను ముందే అనుకున్నాను. కానీ, వరుణ్‌, అర్ష్‌దీప్ చక్కటి బౌలింగ్‌తో కట్టడి చేశారు. ఛేదనలో సంజు శాంసన్‌ మరో ఎండ్‌లో ఉండటాన్ని నేను ఆస్వాదించాను. ఐపీఎల్‌లో దూకుడుగా ఆడటం నాకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు మా టీమ్​లో ఓ అద్భుతమైన వాతావరణం ఉంది. ఇంగ్లాండ్​ పేస్‌ను ఎదుర్కోవడానికి మేమందరం ఎప్పుడూ సిద్ధమే. షార్ట్‌ పిచ్‌ బాల్స్​తో వారు ఇబ్బంది పెడతారని నాకు తెలుసు" అని అభిషేక్ వెల్లడించాడు.

స్వదేశంలో ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో భారత్ శుభారంభం చేసింది. కోల్​కతా ఈడెన్ గార్డెన్స్​ వేదికగా జరిగిన తొలి మ్యాచ్​లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంగ్లాండ్​ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 12.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. ఇంగ్లాండ్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు. తాజా విజయంతో 5 మ్యాచ్​ల సిరీస్​లో భారత్​ 1- 0తో ఆధిక్యం సాధించింది.

అభిషేక్ శర్మ విధ్వంసం- ఇంగ్లాండ్​పై భారత్ గ్రాండ్ విక్టరీ

'సింగ్ ఈజ్ కింగ్': చరిత్ర సృష్టించిన అర్షదీప్- టీ20ల్లో ఆల్​టైమ్ రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details