తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వినాయక చవితి రోజున తెల్లకాగితంపై ఈ అంకెలు రాసి పర్సులో పెట్టుకుంటే - మీకు ఏ కష్టాలూ రావు! - Ganesh Chaturthi 2024

Ganesh Chaturthi 2024: వినాయక చవితిని జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. గణపయ్య కొలువుదీరేందుకు ఊరూవాడా మండపాలు వెలిశాయి. అయితే.. సంవత్సరం అంతా విఘ్నాలు లేకుండా, పనులన్నీ సులభంగా పూర్తి కావాలంటే పండగ నాడు కాగితం మీద ఈ అంకెలు రాసి పర్సులో పెట్టుకుంటే మంచిదంటున్నారు పండితులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ganesh Chaturthi 2024
Ganesh Chaturthi 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 2:27 PM IST

Write These Numbers on White Paper on Ganesh Chaturthi 2024: వినాయక చవితి జరుపుకునేందుకు యావత్​ దేశం సిద్ధమైంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా వాడవాడనా మండపాలు వెలిశాయి. గణపయ్యను పూజిస్తే సర్వ విఘ్నాలూ తొలగిపోతాయని భక్తుల నమ్ముతారు. అయితే.. తొలి రోజున ఒక పనిచేస్తే.. ఏడాది పొడవునా ఎలాంటి కష్టాలూ రాకుండా ఉంటాయని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వినాయక చవితి రోజున గణపతి పూజ చేసే సమయంలో.. తెల్ల కాగితం మీద ప్రత్యేకమైన అంకెలు రాసి, ఆ కాగితాన్ని ఎప్పుడూ మీ పర్సులో పెట్టుకుంటే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు రాకుండా ఉంటాయని మాచిరాజు కిరణ్​కుమార్​ చెబుతున్నారు. ఈ పని ఎలా చేయాలో కూడా సూచిస్తున్నారు.

  • ముందుగా వినాయక చవితి రోజున గణపతి దగ్గర దీపారాధన చేసిన తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకోండి.
  • ఆ తెల్ల కాగితానికి పసుపు రాసి కుంకుమ బొట్లు, గంధం బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ కాగితంలో చతురస్రాకారంలో పెన్నుతో బాక్స్​ గీయాలి.
  • ఆ తర్వాత ఆ స్క్వేర్​లో మొత్తం 16 గడులు వచ్చేలాగా గీసుకోవాలి. అంటే అడ్డం 4 బాక్సులు, నిలువు 4 బాక్సులు వచ్చేలా డ్రా చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో మొదటి అడ్డ బాక్సులలో.. 15, 10, 8, 6 నెంబర్లు రాసుకోవాలి.
  • రెండో వరసలో.. 4, 6, 16, 9 నెంబర్లు రాసుకోవాలి.
  • మూడో వరసలో.. 14, 11, 2, 7 అంకెలు వచ్చేలా రాసుకోవాలి.
  • నాలుగో వరుసలో 1, 8, 13, 12 నెంబర్లు రాసుకోవాలి.
  • ఇలా నెంబర్లు రాయడం పూర్తైన తర్వాత ఆ కాగితాన్ని పూజలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత తీసి బీరువాలో పెట్టుకోవాలి.
  • ఇక ప్రతిరోజూ పనిమీద బయటికి వెళ్లినప్పుడు ఆ కాగితాన్ని మీ వెంట ఉంచుకుంటే మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయని అంటున్నారు.
  • ఒకవేళ మీకు వీలైతే రాగి రేకు తీసుకుని దాని మీద పైన చెప్పిన నెంబర్లు వచ్చేలా చెక్కించుకుంటే ఇంకా మంచిదని అంటున్నారు.
  • ఇలా చెక్కించుకున్న రాగి రేకును పూజ మందిరంలో పెట్టుకుని ప్రతిరోజూ గంధం బొట్లు పెడితే గణపతి స్థిర నివాసం ఏర్పరచుకుంటారని.. ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయని.. అన్ని పనులూ దిగ్విజయంగా పూర్తవుతాయని అంటున్నారు.
15 10 8 6
4 6 16 9
14 11 2 7
1 8 13 12

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details