తెలంగాణ

telangana

ఈ వారం ఆ రాశివారికి అవార్డులు, రివార్డులు- వెంకన్నను ఆరాధిస్తే ఇంకా మేలు! - Weekly Horoscope

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 3:08 AM IST

Weekly Horoscope From 28th Jul to 3rd Aug 2024 : 2024 జులై​ 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From 28th Jul to 3rd Aug 2024 :2024 జులై​ 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగంలో చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే, నూతన అవకాశాలు లభిస్తాయి. కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగుల అసమానమైన ప్రతిభ చూపి అవార్దులు, రివార్డులు అందుకుంటారు. మీ పని తీరుతో అందరినీ మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులు, స్థిరాస్తి రంగం వారు గణనీయమైన లాభాలు పొందవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలకమైన పురోగతి ఉంటుంది. ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో విజయ పరంపరలు కొనసాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నత పదవులను చేపడతారు. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్సులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు తమ వృత్తి పట్ల అంకిత భావంతో ఉండాలి. ఇతరుల వ్యక్తిగత జీవితంలో జోక్యం కూడదు. వ్యాపారంలో వారం మధ్యలో ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉండవచ్చు. సంయమనం పాటిస్తూ సమస్యల పరిష్కారినికి చొరవ చూపించండి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలకు స్వస్తి చెప్పడానికి ప్రయత్నిస్తారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు, ఉద్యోగులు తమ తమ రంగాలలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు ఈ వారం పొందుతారు. ఉద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభించవచ్చు. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి ఉంది. న్యాయపరమైన విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల వలన గణనీయమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సిరిసంపదలు, విజయాలు సమృద్ధిగా ఉంటాయి. విజయోత్సాహంతో ఉరకలేస్తూ ఉంటారు. అయితే అత్యుత్సాహం పనికిరాదు. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరి మనసు నొప్పించే విధంగా మాట్లాడవద్దు. పోటీ పరీక్షల కోసం తయారవుతున్న విద్యార్థులు కష్టపడితే అద్భుతమైన విజయాలను పొందగలరు. ఉద్యోగులు దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరకడంతో ప్రశాంతంగా ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వారం ప్రథమార్ధంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోండి. అప్పుడే లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆర్ధిక సంక్షోభం తలెత్తుతుంది. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. ఓర్పుతో సహనంతో ఉండండి. చెడు సమయం తర్వాత మంచి సమయం తప్పకుండా వస్తుంది. వారం చివరలో మీ జీవిత భాగస్వామి చొరవతో అన్ని సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారస్తులు విపరీతమైన లాభాలను పొందుతారు. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. సహోద్యోగుల స్సహకారం ఉంటుంది. సినీరంగం, కళాకారులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబ సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. సమయానుకూలంగా నడుచుకుంటే సమస్యలు తొలగిపోతాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ వారం అదృష్టం వరిస్తుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో అదృష్టవంతులుగా, లాభదాయకంగా ఉంటారు. వారం ప్రారంభంలో గణనీయమైన ఆర్థిక విజయాన్ని పొందుతారు. వ్యాపారులు వ్యాపారంలో ఊహించని ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులను పొందుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విలాసాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్లండి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అపార్ధాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శుభసమయం. విజయం కచ్చితంగా లభిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్త్తి వ్యాపారాలలో నష్ట నివారణ చర్యలు చేపడతారు. ఆర్ధిక పరంగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మంచిది. లేకుంటే ఎదురయ్యే నష్టాలు తట్టుకోవడం కష్టం. ఉద్యోగులు కార్యాలయంలో పని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, మీరు అదనపు రాబడి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధు వర్గం నుంచి అందిన ఓ వార్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విశేషమైన ధనలాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయట పడతారు. మీడియా, కమ్యూనికేషన్ రంగాల వారికి శుభ సమయం నడుస్తోంది. గొప్ప సాహసంతో నిజాలను వెలికి తీస్తారు. ఆర్ధికంగా పుంజుకుంటారు. విలాసానికి సంబంధించిన వస్తువులపై ఎక్కువ ధనం వెచ్చిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతిని ఆరాధిస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తీవ్రమైన కృషితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతి ఉంటాయి. ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు మీ స్థాయిని పెంచుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు తిరుగులేని విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో తీర్ధ యాత్రలకు వెళ్తారు. శివారాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details