Vastu Tips for Money Plant :ఇంట్లో ఉంటే అదృష్టం అని కొందరూ, పచ్చదనంకోసం మరికొందరూ, ఇంటి అందంకోసం ఇంకొందరూ... మొత్తం మీద ఈ మధ్యకాలంలో దాదాపు అందరి ఇళ్లలో మనీప్లాంట్ కనిపిస్తోంది. ఎవరే కారణంతో మనీ ప్లాంట్‌ను పెంచినా ఆ మొక్క వాతావరణంలోని వేడిని గ్రహించి చల్లదనాన్ని అందిస్తుందన్నది మాత్రం వాస్తవం. అంతేకాదు.. ఈ మనీ ప్లాంట్‌కు వాస్తుశాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్(Money Plant) ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తెస్తుందని, ఇంటి ఆనందం, ఆర్థిక శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు.
అయితే, ఇవన్నీ జరగాలంటే వాస్తుప్రకారం మనీ ప్లాంట్ విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అందులో ముఖ్యంగా మనీ ప్లాంట్‌కు ఈ వస్తువు కడితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని, సంపద అమాంతం పెరుగుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ, వాస్తుప్రకారం.. మనీప్లాంట్ విషయంలో పాటించాల్సిన నియమాలేంటి? ఏ వస్తువు కడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మనీ ప్లాంట్ నాటడానికి సరైన దిశ :వాస్తుశాస్త్రం ప్రకారం మనీప్లాంట్‌ను ఇంట్లో సరైన దిశలో నాటడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుందంటున్నారు. వాస్తుప్రకారం మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఆగ్నేయ దిశలో పెంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది మనీ ప్లాంట్‌కు అత్యంత అనుకూలమైన దిశ అని చెబుతున్నారు. ఎందుకంటే.. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఈ దిక్కులోనే నివసిస్తాడట. అలాగే.. ఈ దిశ శుక్ర గ్రహాన్ని సూచిస్తుంది. అందుకే ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ పెంచితే.. ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద పెరుగుతాయని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలాగే మనీ ప్లాంట్ పెంపకం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
వాస్తుప్రకారం ఇంట్లో ఈ మొక్కలు పెంచారంటే - అదృష్టం మీ వెంట ఉన్నట్లే!