Vastu Tips For For Kitchen : సనాతన ధర్మంలో మనుషుల జీవితాలను సుఖవంతం చెయ్యడానికి ఉద్దేశించినదే వాస్తు శాస్త్రం. మనం ఉండే ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటే అందులో నివసించే వాళ్లకు ఆరోగ్యం, ఆదాయం, అభివృద్ధి కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది వాస్తు గురించి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వాస్తు ప్రకారం వంట గది ఎలా ఉండాలో, పూజ మందిరం విషయంలో చెయ్యకూడని కొన్ని తప్పులు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
వంటగది విషయంలో ఇవి పాటించండి
ఇంట్లో ఎంతో కీలకమైన వంటగది విషయంలో ఖచ్చితమైన వాస్తు నియమాలను పాటించడం ద్వారా అన్ని శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం వంటగది కిటికీలు తూర్పు దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఉండాలి. ఇలా ఉండటం వల్ల గాలి చక్కగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వంటగది గోడలకు పసుపు, నారింజ, గులాబి, చాక్లెట్, ఎరుపు రంగులు వేసుకుంటే మంచిదని వాస్తు చెబుతోంది. వంటగది కింద లేదంటే పక్కన టాయిలెట్ నిర్మించకూడదని వాస్తు చెబుతోంది. వంటగదికి, టాయిలెట్‌కు ఒక్కటే గోడ ఉండకూడదు. అలాగే వంటగది ద్వారం ఇంటి ముఖద్వారం ఎదురుగా ఉండకూడదు. వీధి గుమ్మం నుంచి చూస్తే వంటగది కనిపించని విధంగా నిర్మించుకోవాలని వాస్తు చెబుతోంది. ఇలా ఉండకపోతే కుటుంబ సభ్యులు ఇబ్బందులు, జీర్ణ సంబంధ రుగ్మతలు వస్తాయని వాస్తు వివరిస్తోంది. వంటిల్లు తూర్పు, ఉత్తర తూర్పు దిశలో ఉండకూడదని, ఇలా ఉంటే అభ్యున్నతి తగ్గిపోతుందని వాస్తు చెబుతోంది.
ఉప్పును వాస్తు ప్రకారం ఇలా వాడండి
వంటల్లో ఉప్పు అనేది ఎంత ముఖ్యమో వాస్తులో కూడా దీనికి అంతే ప్రాధాన్యత ఉంది. ఉప్పు అనేది చాలా దోషాలకు నివారిణిగా పని చేస్తుందని వాస్తు చెబుతోంది. అనుకున్న పనులు కావాలంటే, అభ్యున్నతి సాధించాలంటే స్నానం చేసే నీళ్లలో గుప్పెడు ఉప్పు వేసుకుంటే మేలు కలుగుతుందని వాస్తు చెబుతోంది. అలాగే ఇంటికి శుభం కలగడానికి ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వేసుకొని తుడుచుకుంటే మంచిదని వాస్తు వివరిస్తోంది.