Significance Of Swastik Symbol :స్వస్తిక్ గుర్తుకు చాలా ప్రత్యేకత ఉంది. అందుకే గృహప్రవేశాల సమయంలో, పెళ్లి పత్రికలలో, వాహన పూజలలో, నూతన యంత్రాలు వాడే సమయంలో ఈ గుర్తు ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్వస్తిక్.. విష్ణువు చేతిలో ఉండే సుదర్షణ చక్రం లాగే చెడును నివారించి శుభాలను కలిగిస్తుందని విశ్వసిస్తారు. అయితే, స్వస్తిక్‌ను ఇంట్లోని ఈ ప్రదేశాల్లో గీయడం వల్ల కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారని, శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి స్వస్తిక్‌ను ఇంట్లో ఎక్కడ గీయాలో ఈ స్టోరీలో చూద్దాం..
స్వస్తిక్ గుర్తు ప్రాముఖ్యత :హిందూ సంప్రదాయాలలో 'ఓం' తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నంగా స్వస్తిక్ గుర్తును భావిస్తారు. కేవలం హిందూ మతంలోనే కాకుండా ఈ స్వస్తిక్ గుర్తును బౌద్ధ, జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు. పంచభూతాల(భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశం)కు చిహ్నంగా ఈ గుర్తును పరిగణిస్తారు. ఓం కారాన్ని అక్షర రూపంలో రాయకుండా.. ఒక సింబల్ రూపంలో రాస్తే దానినే స్వస్తిక్ గుర్తు అని అంటారంటున్నారు. స్వస్తిక్ గుర్తును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ గుర్తు ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం స్వస్తిక్ గుర్తును ఇంట్లో గీయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదని.. అలాగే ఇంట్లో వారిని కొన్ని రకాల సమస్యల నుంచి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు.
వాస్తు : ఇంటి మేడపైన ఈ వస్తువులు అస్సలు పెట్టొద్దు! - ఆర్థిక సమస్యలు తప్పవు! - Vastu Tips Home
వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక్ చిహ్నాన్ని ఎక్కడ గీయాలి ?:ఈ గుర్తును ఇంట్లో చాలా ప్రదేశాలలో గీయవచ్చు. ప్రతి దానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.
ప్రధాన ద్వారం :స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు గోడపై గీయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని.. అలాగే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని పండితులు చెబుతున్నారు. ఇంకా ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటున్నారు.