తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

అప్పుల బాధలు వేధిస్తున్నాయా? ఆ రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే సమస్య తీరిపోతుంది! - Sambrani Benefits Spiritual - SAMBRANI BENEFITS SPIRITUAL

Sambrani Benefits Spiritual : చాలా మంది ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తుంటారు. అయితే, ధూపాన్ని వేసే ఒక్కోరోజు.. ఒక్కో ఫలితాన్ని పొందవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి అప్పుల బాధలు తీరాలంటే ఏ రోజున ధూపం వేయడం మంచిదో ఇప్పుడు చూద్దాం.

Sambrani
Sambrani Benefits Spiritual (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 3:24 PM IST

Sambrani Benefits Spiritual :పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాల్లో సాంబ్రాణి ధూపం ఒకటి. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విశ్వసిస్తారు. చంటి పిల్లల ఆరోగ్యం మొదలు.. ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా, సువాసన భరితంగా మార్చుకునేందుకు ఈ ధూపం ఉపయోగపడుతుంది. అలాగే పూజగదిలో సాంబ్రాణిని వెలిగించడం వల్ల ఇళ్లంతా పాజిటివ్‌ ఎనర్జీతో నిండిపోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంకా మానసిక సాంత్వన కలుగుతుందని అంటున్నారు. అయితే, వారంలో ఒక్కోరోజు సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా అప్పుల బాధలు తీరాలంటే ఈ రోజున సాంబ్రాణి వేయడం మంచిదంటున్నారు.

ఆదివారం :ఈ రోజున ఇంట్లో గుగ్గిలంతో సాంబ్రాణి వేయడం వల్ల ఆత్మబలం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే సిరిసంపదలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయని అంటున్నారు. ఈశ్వర అనుగ్రహం త్వరగా లభిస్తుందని పేర్కొన్నారు.

సోమవారం :సోమవారం రోజున ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చంటున్నారు.

మంగళవారం :మంగళవారం రోజున ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం వల్ల శత్రుభయం, ఈర్ష్య, అసూయ వంటి వాటిని దూరం చేసుకోవచ్చంటున్నారు పండితులు. అలాగే అప్పులతో బాధపడేవారు ఈ రోజున గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల తొందరగా అప్పులు తీరతాయని పండితులు చెబుతున్నారు. కుమారస్వామి అనుగ్రహం పొందవచ్చని పేర్కొన్నారు.

బుధవారం :ఈ రోజున సాంబ్రాణి ధూపం వేస్తే నమ్మకద్రోహం, అలాగే ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. బుధవారం రోజున సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు.

ఆంజనేయుడి అనుగ్రహం లభించాలంటే - హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

గురువారం :చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూర్తి కావాలంటే.. గురువారం రోజున పూజ గదిలో సాంబ్రాణి పొగ వేయాలని సలహా ఇస్తున్నారు.

శుక్రవారం :లక్ష్మీ కటాక్షం పొందడానికి ఈ రోజున సాంబ్రాణి ధూపం వేయాలని.. శుక్రవారం రోజున ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు.

శనివారం :కొంత మంది ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటారు. అయితే, కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలా బద్ధకంగా ఉంటే.. శనివారం రోజున సాంబ్రాణి వేయాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఇలా ఒక్కోరోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఫలితాలను పొందవచ్చని వాస్తు పండితులంటున్నారు. అలాగే సాంబ్రాణి పొగ వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందని పేర్కొన్నారు.

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వాస్తు: మీ ఇంట్లో స్వస్తిక్​ గుర్తును ఈ ప్రదేశంలో గీస్తే - అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది!

సకల పాపాలు తొలగించే పట్టాభి రాముడు- జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ పురాతన క్షేత్రం ఎక్కడుందంటే?

ABOUT THE AUTHOR

...view details