Runa Vimochana Puja on Tuesday :వేమన కవి చెప్పినట్లుగా ఈ లోకంలో అప్పు లేని వాడే గొప్ప శ్రీమంతుడు. ఎందుకంటే అప్పు చేసి పంచభక్ష్య పరమాన్నాలు తినే కన్నా ఉన్నంతలో పచ్చడి మెతుకులు తిన్నా గొప్పే! ఒక్కోసారి అప్పు చేయక తప్పదు. కానీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక ప్రణాళిక ప్రకారం డబ్బు పొదుపు చేసుకుంటే సాధ్యమైనంత వరకు అప్పు చేసే అవసరం రాదు. ఒకవేళ గత్యంతరం లేక అప్పు చేసినా అది తీరే వరకు నిద్ర పోకూడదు. మనం నిద్రపోయినా మనం చేసిన అప్పు నిద్రపోదు. చాపకింద నీరులా వడ్డీతో కలిసి తడిసి మోపెడవుతుంది.
రుణ విముక్తి పరిహారాలు
సునాయాసంగా తీర్చేయవచ్చులే అని అప్పు చేసి చివరకు ఏవో కారణాల వల్ల అప్పు తీర్చలేక ఇబ్బందులు పడేవారు కొన్ని పరిహారాలు పాటిస్తే రుణబాధలు నుంచి బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హనుమంతుని ఆరాధన
రుణ విముక్తి కోసం మంగళవారం హనుమంతుని ఆలయాన్ని సందర్శించి మల్లెపూల నూనెతో దీపం వెలిగించి, ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసా పఠిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.
సింధూర పూజ
హనుమంతునికి సింధూరం అంటే ఏంటో ఇష్టం. హనుమంతుని ఆలయంలో మంగళవారం సింధూరంతో హనుమంతునికి అష్టోత్తర శతనామ పూజ చేయిస్తే రుణబాధలు నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.
తమలపాకుపై శ్రీరామ
హనుమంతుడు రామభక్తుడు. తీవ్రమైన రుణ బాధలు ఉన్నవారు మంగళవారం సింధూరంలో గంగాజలం కలిపి, అగరుబత్తీకి పత్తిని చుట్టి సింధూరంలో ముంచి తమలపాకుపై శ్రీరామ అని వ్రాయాలి. అలా 108 ఆకులపై వ్రాసి దానిని ఒక హారంలా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమకు అలంకరించాలి. ఇలా 11 మంగళవారాలు చేస్తే హనుమ అనుగ్రహంతో రుణబాధలు నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.