October 13th to October 19th 2024 Weekly Horoscope : 2024 అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వృత్తిపరమైన ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్ధికంగా గొప్ప శుభఫలితాలను అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు సమకూరడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సంపదలు వృద్ధి చెందడంతో సంతోషంగా ఉంటారు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల సహకారం, వృత్తిపరంగా సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా వ్యహరించాల్సిన సమయం. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అవసరం. వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలను సన్నిహితుల సహకారంతో అధిగమిస్తారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కష్ట సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఓదార్పునిస్తుంది. స్వబుద్ధితో, సొంత నిర్ణయాలతో లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారిస్తే మంచిది. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వొద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పఠిస్తే ఆరోగ్యం మెరుగు పడుతుంది.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. దేనికి భయపడకుండా ధైర్యంగా ఉంటే మంచిది. అడ్డంకులు, కఠినమైన పరిస్థితులలో మనోబలం కోల్పోకుండా ఉండడం అవసరం. ఉద్యోగులకు వారం ప్రారంభంలో తీవ్రమైన పని ఒత్తిడి ఉండవచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని విజయవంతంగా నడిపించడంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. వారం చివరలో కెరీర్లో దూసుకెళ్తారు. పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏకా గ్రత, కష్టపడే తత్వంతో చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్యసాధన కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగులు సహోద్యోగులు, ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తే విజయాలు సాధించవచ్చు. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు వారం చివరలో వ్యాపారంలో తీవ్రమైన సవాళ్లు, పోటీలను ఎదురుకోవాల్సి ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సాహసోపేతమైన విజయాలు సాధిస్తారు. ఎవరి అంచనాలకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్తూ అందరి అభిమానాన్ని పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. ఆశించిన దానికన్నా ఎంతో ఎక్కువగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబలో శుభకార్యాలు జరుగుతాయి. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఊహించని విధంగా సంపదలు కలిసి వస్తాయి. శ్రీ లలిత సహస్రనామ పారాయణ శుభకరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధించిన సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా పనిచేసి అన్ని పనులు సకాలంలో పూర్తి చేరారు. ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉంది. ఆర్ధిక ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్ధిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడం వలన కీలకమైన అసైన్మెంట్లను షెడ్యూల్లో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు మీ నుంచి ఏమి ఆశిస్తున్నారో గ్రహించి నడుచుకుంటే మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.
తుల (Libra) :తులరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో గణనీయమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. వృత్తి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కెరీర్ విజయపథంలో దూసుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పోటీ తత్త్వం పెరుగుతుంది. స్వల్ప విజయాలు మాత్రమే ఉండవచ్చు. ఇతరులపై మీ సొంత అభిప్రాయాలను రుద్దడం మానుకోవాలి. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పకుండా పాటించాలి. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం. మెరుగైన ప్రయోజనాల కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఉత్తమం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్ధిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చట్టపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఉండవచ్చు. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సోమరితనం, నిర్లక్ష్యం భారీ నష్టాలను కలిగిస్తుంది. గత తప్పిదాల కారణంగా వృత్తి వ్యాపారాలలో తీవ్ర నష్టాలు చోటు చేసుకుంటాయి. స్నేహితుల సహకారంతో నష్ట నివారణ చర్యలు చేపడతారు. ఆర్ధిక పరంగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మంచిది. లేకుంటే ఎదురయ్యే నష్టాలు తట్టుకోవడం కష్టం. ఉద్యోగస్తులు కార్యాలయంలో పని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, రుణవిముక్తికి అదనపు రాబడి కోసం ప్రయత్నాలు చేస్తారు. బంధు వర్గం నుంచి అందిన ఓ వార్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ బలహీనతలు శత్రువులకు బలంగా మారే ప్రమాదముంది. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మరికొంతకాలం వేచి చూడాలి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో డాకుమెంట్స్ పూర్తిగా పరిశీలించిన తరువాతే ముందడుగు వేయండి. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముందుగా ఈ రాశి వారు దేనికి తొందరపడకుండా ప్రశాంతంగా, ఏకా గ్రతతో ఉండటం ముఖ్యం. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటే లక్ష్యాలను సాధించడం సులభమవుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఓ శుభవార్త మీలో ఉత్తేజాన్ని నింపుతుంది. వారం చివరిలో విద్యార్థులు గణనీయమైన అభివృద్ధిని సాధిస్తారు. పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కోరుకున్న చోట చదువుకునే అవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రశాంతతను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.