Nagula Chavithi Prasadam Recipes:హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో నాగుల చవితి ఒకటి. కార్తిక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈ ఏడాది నాగుల చవితి నవంబర్ 5వ తేదీన జరుపుకోనున్నారు. ఈ క్రమంలో మహిళలు నాగేంద్రుడికి పూజలు చేసి, పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పిస్తారు. నాగుల చవితి నైవేద్యాలు అంటే చలిమిడి, చిమ్మిలి, వడపప్పు గుర్తుకువస్తాయి. ఇక వాటిని ఎంతో మంది ఎన్నో రకాలుగా తయారు చేస్తుంటారు. కానీ ఈ పద్ధతిలో చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. పైగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ నైవేద్యాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాం..
1. చలిమిడి కావాల్సిన పదార్థాలు:
- తడి బియ్యం పిండి - 1 కప్పు
- బెల్లం తురుము - అర కప్పు
- యాలకుల పొడి - చిటికెడు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
చలిమిడి తయారీ విధానం:
- ముందుగా తడి బియ్యప్పిండిని రెడీ చేసుకోవాలి. ఈ ప్రసాదం ప్రిపేర్ చేసే ముందు రోజు రాత్రి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
- తెల్లారి మరోసారి కడిగి వాటర్ లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి.
- ఇలా చేసుకున్న పొడిని ఓ బౌల్లోకి వేసుకుని అందులోకి బెల్లం తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. ఒకవేళా చలిమిడి ముద్ద ఏమైనా లూజుగా ఉంటే మరికొంచెం తడి బియ్యప్పిండిని కలుపుకోవాలి. అంతే చలిమిడి రెడీ.
- ఇదే చలిమిడిని పొడి బియ్యప్పిండితో కూడా చేసుకోవచ్చు. అదెలాగంటే.. మిక్సీజార్లో బియ్యం, బెల్లం తురుము వేసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.
- అలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుంటే చలిమిడి రెడీ.
2. చిమ్మిలి కోసం:
- నువ్వులు - 1 కప్పు
- బెల్లం తురుము - అర కప్పు