Money Remedies in Astrology : సంపన్నులు కావాలంటే.. ధనం సంపాదిస్తే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవాలి, రెట్టింపు చేసుకుంటూ వెళ్లాలి. కానీ.. చాలా మంది విషయంలో సంపాదన ఉన్నా.. నిలబెట్టుకోలేరు. వృద్ధి చేసుకోలేరు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు 'మాచిరాజు కిరణ్ కుమార్' వివరిస్తున్నారు.
నల్లటి ఉట్టి :నల్లటి ఒక ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడదీయాలట. ఏ ఇంట్లో అయితే, నల్లటి ఉట్టి వేలాడుతుంటుందో.. ఆ గృహంలో డబ్బు మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుందని రహస్య పరిహార శాస్త్రంలో పేర్కొన్నారని ఆయన తెలిపారు.
గోధుమల్లో ఇవి కలపండి:చాలా మంది గోధుమ పిండి కోసం గోధుమలను మర ఆడించడానికి ఇస్తుంటారు. అయితే.. గోధుమలు మర ఆడించడానికి ఇచ్చేముందు అందులో 11 తులసి ధలాలు, రెండు పసుపుకొమ్ములు వేయండి. తర్వాత వాటిని మర ఆడించడానికి ఇవ్వాలట. అప్పుడు వచ్చిన గోధుమ పిండిని ఉపయోగిస్తే.. అనేక మార్గాల్లో ధనం వస్తుందట.
మేడిచెట్టు వేరు :ఈ చెట్టు వేరుకి చాలా శక్తి ఉంది. మీకు మేడిచెట్టు కనబడితే దాని వేరును ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసివచ్చినటువంటి రవి పుష్యయోగమున్న రోజు గానీ.. లేదా గురువారం పుష్యమి నక్షత్రం కలిసివచ్చినటువంటి గురు పుష్యయోగమున్న రోజు ఇంటికి తీసుకురండి. దానిని పూజ గదిలో ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. వీలైతే మేడిచెట్టు వేరుని తాయత్తులాగా శరీరానికి కట్టుకోవాలని సూచిస్తున్నారు.
మర్రి చెట్టు ఆకులు :ఒకవేళ మీకు మేడిచెట్టు వేర్లు దొరకపోతే.. మర్రి చెట్టు ఆకులతో ఒక పరిహారాన్ని చేయవచ్చు. గురు పుష్యయోగమున్న రోజు లేదా రవి పుష్యయోగమున్న రోజున ఆరు మర్రిచెట్టు ఆకులను ఇంటికి తీసుకురండి. ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. వాటిపై తడి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి పూజ గదిలో పెట్టి, అవి ఎండిపోయేంత వరకు అలానే ఉంచాలట. మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని పూజగదిలో ఉండడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని మాచిరాజు కిరణ్ తెలిపారు.