తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి తీవ్ర ఆర్థిక నష్టాలు! కోపాన్ని అదుపులో ఉంచుకోండి! - Horoscope Today May 3rd 2024 - HOROSCOPE TODAY MAY 3RD 2024

Horoscope Today May 3rd 2024 : మే​ 3న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 3rd 2024
Horoscope Today May 3rd 2024 (ETV BHARAT TELUGU TEAM)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 5:02 AM IST

Horoscope Today May 3rd 2024 : మే​ 3న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వినోదం కోసం ఎక్కువగా ధనవ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ఉద్యోగులకు చేసే పనిలో పురోగతి ఉంటుంది. పలు మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. శివాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మంగళకరంగా ఉంటుంది. ఈ రోజు కొత్తగా ఆరంభించే కొత్త వెంచర్స్ , ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు ప్రత్యేకంగా లాభదాయకమైన రోజు. పై అధికారుల నుంచి మంచి గుర్తింపు పొందుతారు. ప్రమోషన్, జీతం పెరుగుదల సూచన ఉంది. ఇంట్లో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. స్నేహితులతో బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. శారీరకంగా, మానసికంగా నీరసం, నిరుత్సాహం ఆవరిస్తాయి. ఏ పని పట్ల ఆసక్తి లేకుండా నిరాసక్తంగా ఉంటారు. జీర్ణసంబంధమైన అనారోగ్యాలు చికాకు పెడతాయి. వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉండదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు చేసే పనిలో పురోగతి ఉండదు. సహోద్యోగుల సహకారం ఉండదు. కష్టానికి తగిన ఫలితం ఉండదు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు, వ్యాపారులు వ్యాపారంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టాలు సంభవించే సూచనలున్నాయి. పెట్టుబడులు, స్పెకులేషన్లకు ఈ రోజు అనుకూలంగా లేదు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితం మంచి మలుపు తిరుగుతుంది. బంగారు భవిష్యత్​కు పునాది పడుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. బంధు మిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా మీలో ఉత్సాహం, శక్తి తొణికసలాడుతుంటాయి. సృజనాత్మకతతో మీరు చేసే పనులు అందరిని ఆకట్టుకుంటాయి. మీరు ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశీయానం ఉండవచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. స్థిరాస్తి రంగం వారికి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి మంచి సమయం. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం మేలు. అనుకున్నది సాధించే క్రమంలో ఇతరులతో పరుషంగా మాట్లాడుతారు. ఇందువలన సంబంధాలు దెబ్బతింటాయని గ్రహించండి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ నోటి దురుసు తనం కారణంగా ఘర్షణలు జరిగే అవకాశముంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. శత్రువులు ఎక్కడో కాదు మీ పక్కనే ఉన్నారన్న విషయాన్నిగ్రహించండి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. శ్రీలక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి శుభసమయం నడుస్తోంది. ఈ శుభ సమయాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తే సత్ఫలితాలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు ఉన్నా మీ ప్రతిభతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వృత్తి ఉద్యోగాలలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో అప్పుల పాలవకుండా చూసుకోండి. పరిస్థితి అదుపు తప్పుతున్నప్పుడు మనో నిబ్బరం కోల్పోకుండా చూసుకోండి. సహనంగా ఉంటే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలరు. ఆర్థిక నష్టం సూచితం. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పని ప్రదేశంలో ఎవరితోనూ ఘర్షణలకు పోవద్దు. ఆ ప్రభావం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్ధిక లాభం, శత్రు జయం ఇలా ఎటు చూసినా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్, స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు తారాబలం బ్రహ్మాండంగా ఉంటుంది. పలు రకాల ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. అన్ని గ్రహాలు ఉచ్చదశలో ఉన్నాయి. శారీరకంగానూ, మానసికంగానూ చాలా సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు, తీర్థ యాత్రలకు వెళతారు. ఆధ్యాత్మికంగా ఈ రోజు గడవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపారులకు సర్వత్రా జయం. విజయం ఒంటరిగా రాదు ధనలాభాలను వెంటబెట్టుకొని వస్తుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిత్తశుద్ధితో పనిచేసి మంచి విజయాలను అందుకుంటారు. ఓర్పుతో ఉంటే సమస్యలు తగ్గు ముఖం పడుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మేలు. తొందరపాటు నిర్ణయాల వలన నష్టం కలగవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి ధ్యానం శుభప్రదం .

ABOUT THE AUTHOR

...view details