తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు అన్ని విషయాల్లో ప్రశంసలు- కానీ మనశ్శాంతి ఉండదు! - DAILY HOROSCOPE IN TELUGU

2025 జనవరి​ 31వ తేదీ (శుక్రవారం) రాశిఫలాలు

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 3:51 AM IST

Horoscope Today January 31st 2025 : 2025 జనవరి​ 31వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో పనిచేసి విజయం సాధిస్తారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగులకు అదృష్టకరంగా ఉంటుంది. కొత్తగా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమయాలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల సూచన ప్రకారం ముందుకెళ్తే మంచిది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారంలో సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. ధన నష్టం సంభవించే సూచన ఉంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో సమయానుకూలంగా నడుచుకోవడం ప్రయోజనకరం. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఘర్షణలు మానుకోండి. ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శివారాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది. బంగారు భవిష్యత్​కు అవసరమైన ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు. సన్నిహితుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలకు ప్రధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మికత వైపు మీ మనస్సు మళ్లుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శాంతి సమన్వయ ధోరణి ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో లాభం, పరపతి ఊపందుకుంటాయి. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉండడంతో రోజంతా హుషారుగా ఉంటారు. ఆదాయం ఆశించినట్టే ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి సహాయసహకారాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభప్రదం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్నీ కుటుంబంతో చర్చించి చేయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పనిలో ఉత్సాహం లోపించకుండా చూసుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. కీలక వ్యవహారంలో పురోగతి ఉంటుంది. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మనఃసౌఖ్యం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మౌనంగా, గంభీరంగా ఉండాలి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక విషయాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే విజయం సిద్ధిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ రోజు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్​లో పెట్టిన పెట్టుబడులు బాగా లాభిస్తాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు చికాకు పెడతాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ముందుకుసాగి తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడండి. అనవసర విషయాల గురించి సమయం వృధా చేయవద్దు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత, పట్టుదల అవసరం. నష్ట భయం ఉంది కాబట్టి వ్యాపారస్తులు పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. కుటుంబ సభ్యులతో వివాదం వస్తుంది. కోర్టు వ్యవహారాలు జాగ్రత్త గా డీల్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details