Horoscope Today January 26th 2025 : 2025 జనవరి 26వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా ఎక్కువగా దైవచింతనలో గడుపుతారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్లో మీరు అందుకునే విజయాలకు ఇది బాట అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అదుపులేని కోపావేశాల కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. శత్రువులు పెరిగే ప్రమాదముంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. యోగా ధ్యానంతో కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితిలో పనిలో నిగ్రహాన్ని కోల్పోకండి. దైవారాధన మానవద్దు. శ్రీ నృసింహస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన వ్యవహారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోండి. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే పనులు సవ్యంగా జరుగుతాయి. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ అవసరం. ఇంటా బయటా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసుకోండి. వృధా ఖర్చులు నివారించాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సమస్యలపై దృష్టి సారిస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని సంఘటనలుఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారపరంగా వివిధ మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. నిర్దేశించిన లక్ష్యం వైపు సూటిగా పయనించ గలిగితే విజయం సిద్ధిస్తుంది. ఆటంకాలు అధిగమిస్తే వృత్తివ్యాపారాలలో రాణిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని ఇస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆలోచించి ఖర్చు చెయ్యండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూరదృష్టితో చేసే పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. కీలక అంశాల్లో అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. రుణభారం తగ్గవచ్చు. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉండండి. ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారవచ్చు. సహనం వహించండి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్థులకు ఫలప్రదంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఖర్చులను అదుపు చేయండి. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపుదల, ఉన్నతాధికారుల ప్రశంసలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. గృహ జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి ఏ ఒడిదుడుకులూ లేకుండా కొనసాగుతుంది. మీ పిల్లలు వారు పని చేసే రంగాల్లో మంచి అభివృద్ధి సాధించడం మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ముందుచూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. సమీప బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. దయాగుణంతో దైవానుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాస్తుతి పారాయణ మేలు చేస్తుంది.