తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు వివాదాలకు దూరంగా ఉండాలి- లేకుంటే సమస్యలు తప్పవ్- శివారాధన శ్రేయస్కరం! - DAILY HOROSCOPE

2025 జనవరి​ 20వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 4:00 AM IST

Horoscope Today January 20th 2025 : 2025 జనవరి​ 20వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి వ్యతిరేకతలు లేని సానుకూలమైన ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. సదస్సులు, సమావేశాలు, చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సంకట పరిస్థితుల కారణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనిశ్చితి, సందిగ్ధతత నెలకొంటాయి. ఎవరితోనూ చర్చలూ , వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిపితే మంచిది. స్థిరాస్తులు, వారసత్వపు ఆస్తుల గురించిన చర్చ వాయిదా వేయాలి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ప్రయాణాలు వాయిదా వేయాలి. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరులు, స్నేహితుల నుంచి ఆర్థిక లబ్ధి పొందుతారు. విహారయాత్రలకు వెళ్తారు. వృత్తి పరంగా చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ దారులు, ప్రత్యర్థులు పై విజయం సాధిస్తారు. సమాజంలో పరపతి, గౌరవం పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉండవచ్చు. పదోన్నతులకు అవకాశం ఉంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కోపం, పరుష పదాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే వీలైనంత వరకు ఈ రోజు కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. వ్యాపారంలోనూ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఊహించని ధనలాభాలు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కనకదుర్గాదేవి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ఓ సంఘటన మనస్తాపం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నీటి గండం ఉంది. జలాశయాలకు దూరంగా ఉండండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం విచారం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో తీవ్రమైన జాప్యం జరిగే సూచనలున్నాయి. ఉన్నతాధికారులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శని స్తోత్రం పాటించడం ఉత్తమం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఇంతకాలం అనుభవించిన కష్టాలు, సమస్యలు తీరిపోతాయి. దైవనామ స్మరణ, ధ్యానం వలన ప్రశాంతత దొరుకుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పగించిన బాధ్యతలు పూర్తి చేయడం వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details