తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు నిద్రలేచిన నుంచి శుభవార్తలే- కానీ కోపం మాత్రం మస్ట్ కంట్రోల్​! - DAILY HOROSCOPE

2025 ఫిబ్రవరి 25వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2025, 3:43 AM IST

Horoscope Today February 24th 2025 : 2025 ఫిబ్రవరి 25వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శుభ సమయం నడుస్తోంది. మీ లక్షలను చేరుకుంటారు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శివారాధన విశేషమైన ఫలితాలనిస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. నిర్ణయాలలో స్థిరత్వం లేకపోవడంతో సమస్యలు ఎదురవుతాయి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబంతో తీర్ధ యాత్రలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారు తమ తమ రంగాలలో శుభఫలితాలు అందుకుంటారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వాయిదా వేస్తే మంచిది. ఖర్చుల మీద అదుపు ఉంచండి. ఉద్యోగంలో పని భారం పెరగవచ్చు. ఒత్తిడి అధిగమించేందుకు యోగా చెయ్యండి. ఈశ్వరుని ఆలయ సందర్శనంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొని సంతోషంగా గడుపుతారు. వృత్తిపరంగా, ఆర్ధికంగా లాభపడతారు. వ్యాపారంలో భాగస్వాముల నుంచి ప్రయోజనం పొందవచ్చు. సమాజంలో గౌరవం పొందుతారు. హనుమాన్ చాలీసా పారాయణ ఉత్తమం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు ఇబ్బంది కలిగించవచ్చు. చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆర్ధికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. చెడు ఆలో చనలలో సమయం వృధా చేయకండి. శివపంచాక్షరీ మంత్రజపం సత్ఫలితాలనిస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కష్టాలను తట్టుకొని ధైర్యంగా ముందుకుసాగి అనుకున్నది సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నిర్లక్ష్యం కూడదు. ఆశయాలు నెరవేరుతాయి. తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. నృసింహస్వామి దర్శనం శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. నూతన భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సత్వర విజయం ఉంటుంది. వృత్తి ఉదోగాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఒత్తిడిని తగ్గించుకోడానికి ప్రయత్నించండి. ఆర్ధికంగా శుభసమయం నడుస్తోంది. శ్రీలక్ష్మి ఆరాధన శ్రేష్టం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచికాలం నడుస్తోంది. ఆశించిన ఫలితాలను అందుకుంటారు. కోరికలు నెరవేరుతాయి. ఆర్ధికంగా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు అండగా ఉంటాయి. బుద్ధిబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో శుభఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మనోధైర్యంతో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే కలహాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో నడుచుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ముఖ్యమైన విషయాలు నిర్లక్ష్యం చేయడం ప్రమాదం. ఉన్నతంగా ఆలోచిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణతో సత్ఫలితాలుంటాయి.

ABOUT THE AUTHOR

...view details