తెలంగాణ

telangana

ఈరోజు ఆ రాశివారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం! - HOROSCOPE TODAY AUGUST 4TH 2024

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 5:01 AM IST

Horoscope Today August 4th 2024 : ఆగస్టు​ 4న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Horoscope Today August 4th 2024 (ETV Bharat)

Horoscope Today August 4th 2024 : ఆగస్టు​ 4న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సవాళ్లు ఎదురైనా అధిగమిస్తారు. మీ బలహీనతలను అవకాశాలుగా మార్చుకునే అవకాశవాదులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. బలహీనతలను అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయస్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆందోళన, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. కాని మీ ప్రతిభతో వాటిని అధిగమిస్తారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. ఉద్యోగాలకు స్థానచలనం ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. దూరపు బంధువుల నుంచి అందిన ఓ వార్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారికి శ్రమతో కూడిన విజయం ఉంటుంది. పనిభారంతో అలసటగా ఉంటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు కూడా అందుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్థులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. స్నేహితులతో విహార యాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. గృహంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని ఘటనల కారణంగా వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సహనంతో ఉంటే మంచిది. ఉన్నతాధికారుల సహకారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో తీవ్రమైన పోటీ కారణంగా నష్టపోవాల్సివస్తుంది. కుటుంబ కలహాలు అశాంతికి కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఆర్ధిక పురోగతి ఉంటుంది. వ్యాపారస్థులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రయోజనం ఉంటుంది. ఊహించని సంపద కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. ఇంట్లో, ఆఫీస్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారులు పనిలో మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు. ప్రమోషన్ ఉండవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు ఈ రోజే శుభకరంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకోని ఆటంకాలు, సవాళ్లు కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. మానసికంగా, శారీరకంగా అలసటకు గురి కావడంతో పనులల్లో ఆలస్యం చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో కష్టనష్టాల కారణంగా చికాకు కలుగుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అదనపు ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. దైవబలం మీద విశ్వాసంతో చిత్తశుద్ధితో పనిచేస్తే అన్ని సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సంఘటనలు, సవాళ్లతో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఈ రోజంతా తీరిక లేకుండా పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ప్రయత్నంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. గురు శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలత, అభివృద్ధి ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ఉన్నతాధికారుల అభిమానాన్ని చూరగొంటారు. అందరికీ విశ్వాసపాత్రంగా ఉంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గత వైభవాన్ని తిరిగి పొందుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు తమ తమ రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ సమర్థతకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.కుటుంబ సభ్యులతో గడిపే సమయం సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ఊహించని విధంగా సంపద పెరగడంతో ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణం మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉంది కాబట్టి విద్యార్థులు విదేశాలలో కొత్త అవకాశాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే విజయం మీదే! ఆర్ధికంగా బలోపేతం అవుతారు. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

ABOUT THE AUTHOR

...view details