తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు మంచి లాభాలు- కానీ ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచిస్తే బెటర్! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 26th 2024 : ఆగస్టు​ 26వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 3:10 AM IST

Horoscope Today August 26th 2024 :ఆగస్టు​ 26వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరోపకారం కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందేందుకు మరింత కష్టపడాలి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మెరుగైన ప్రయోజనాల కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.


వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తివ్యాపార రంగాల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూరవుతాయి. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల గురించి, సంతానం గురించి ఒక శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వ్యాపారులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంది. పెట్టుబడులు పెట్టేముందు ఆచి తూచి వ్యవహరించండి. చట్టపరమైన, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు కాదు. కోపాన్ని, మాటతీరును అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అదృష్టం కలిసి వచ్చి చేపట్టిన అన్నిపనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. సన్నిహితుల, శ్రేయోభిలాషుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో పనిచేసి తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం వరించి ప్రమోషన్ పొందుతారు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. స్థిరాస్తి డాక్యుమెంట్లు చూడడానికి మంచి రోజు. పిత్రార్జితం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. యోగా, ధ్యానంతో ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. లేకుంటే అందరితో వివాదాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది. శ్రీ ఆంజనేయస్వామి దండకం చదువుకుంటే మంచిది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు అన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో ఈ రోజు సరదాగా, సంతోషంగా ఉంటారు. ఆర్ధికంగా పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతం గా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేసారి కలిసివస్తాయి. కుటుంబంలో సమన్వయ ధోరణితో కలిసి మెలిసి ఉంటారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు చకచకా పూర్తి చేస్తారు. ఈ రోజంతా చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభం ఉండవచ్చు. గురు శ్లోకాలు పఠించడం శుభకరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు, అవాంతరాలు ఎదురు కావడం వల్ల రోజులో ఎక్కువ భాగం విచారం, చింతలతోనే వెళ్లదీస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధమైన చికాకులు. అభిప్రాయ భేదాలతో విచారంతో ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఉద్యోగస్తులు చిత్తశుద్ధితో పనిచేస్తే సీనియర్ల మెప్పు పొందే అవకాశం ఉంది. పోటీ దారులతోనూ, తోటివారితోనూ వాదనల్లోకి దిగవద్దు. శనిస్తోత్రం పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు విద్యా సంబంధంగా రాణిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తే మంచిది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి . ముఖ్యమైన వ్యవహారాల్లో పరిణితితో వ్యవహరిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు కీలక వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు పనిలో చూపే సృజనాత్మకత, పని పట్ల చూపే అంకితభావం గొప్ప విజయాలను తెచ్చి పెడతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details