తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారి ఆరోగ్యం బాగుండదు! ఆర్థికంగా నష్టం వాటిల్లే ఛాన్స్​ - Horoscope Today April 6th 2024

Horoscope Today April 6th 2024 : ఏప్రిల్​ 6న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 6th 2024
Horoscope Today April 6th 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 5:04 AM IST

Horoscope Today April 6th 2024 : ఏప్రిల్​ 6న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశివారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. అన్ని రకాల ఆందోళనలు తొలగిపోతాయి. అన్నిపనులు ఒకేసారి చేయాలనుకుని ఒత్తిడికి లోనవుతారు. ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రావాల్సిన బకాయిలు చేతికందుతాయి. దక్షిణామూర్తి ధ్యానం శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభరాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృతివ్యాపారాల్లో రాణిస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తి కావడం వల్ల విశ్రాంతి తీసుకుంటారు. విహారయాత్రలకు వెళతారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. శివారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. చిన్నపాటి అనారోగ్యం కలత పెడుతుంది. వృత్తివ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఆందోళన చెందవద్దు. సంయమనం పాటించండి. అన్నీ సర్దుకుంటాయి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఏ పని చేసినా ఆచి తూచి అడుగు వేయాలి. ఆరోగ్యం సహకరించదు. ఆర్ధిక నష్టం తలెత్తే ప్రమాదం ఉంది. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. గొడవలకు దూరంగా ఉండండి. ఇష్ట దేవతారాధన గండాల నుంచి కాపాడుతుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవల కారణంగా అశాంతికి గురవుతారు. ఆరోగ్యభంగం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అనవసర విషయంలో జోక్యం చేసుకోవద్దు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది..

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. విపరీతమైన ధనలాభం. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు సాధారణంగానే ఉంటుంది. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. కృషికి తగ్గ ఫలితం రాక నిరాశ చెందుతారు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. విఘ్నేశ్వర ధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే గొడవలు రావచ్చు. అనారోగ్యం బాధ పెడుతుంది. మీ ప్రతిష్టకు భంగం కలిగే ఏ పని కూడా చేయవద్దు. ధనాదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీరు పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు కావడం వల్ల నిరాశకు లోనవుతారు. తీవ్రమైన గొడవలకు ఆస్కారం ఉంది. ఒత్తిడిని అదుపులో పెట్టుకోండి. ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు సర్దుకుంటాయి. సూర్యుని ఆరాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్ గురించి ఒత్తిడికి గురవుతారు. దైవబలం ఉంటే తప్ప గట్టెక్కలేరు. వృత్తివ్యాపారాలో ఉండే వారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆర్ధికంగా అనుకూలం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఎటు చూసినా లాభాలే లాభాలు. ప్రతికూల ఆలోచనలను వీడండి. ఆర్ధికంగా బలపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. విహారయాత్రకు వెళతారు. విందువినోదాలలో కాలక్షేపం చేస్తారు. దుర్గారాధన శ్రేయస్కరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. మిత్రుల సహాయంతో ఆపదల నుంచి బయట పడతారు. స్నేహం విలువను తెలుసుకుంటారు. ఆర్ధికంగా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక శుభవార్త వింటారు. శివాష్టకం పఠించండి.

ABOUT THE AUTHOR

...view details