తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు కొన్ని వ్యవహారాల్లో బీ అలర్ట్- లేకుంటే బూడిదలో పోసిన పన్నీరే! - Daily Horoscope Today

Horoscope Today April 26th 2024 : ఏప్రిల్​ 26న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 4:49 AM IST

Horoscope Today April 26th 2024 : ఏప్రిల్​ 26న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏళ్ల తరబడి మీ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు వలే అయిపోతుంది. పని ప్రదేశంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.


వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. పలు మార్గాల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. మీరు సాధించిన విజయాల ద్వారా సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. దూరదేశాల నుంచి శుభవార్త వింటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఇది మీకు మంచి పేరు ప్రతిష్ఠలను తీసుకు వస్తుంది. పలువురి ప్రశంసలను అందుకుంటారు. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఊహించినదానికన్నా అధిక ధనలాభం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఔషధ సేవనం తప్పదు. మానసిక అశాంతియే ఇందుకు కారణం. మనసు ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రయత్నించండి. అన్నీసర్దుకుంటాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తే మేలు. సన్నిహితులతో గొడవలు వచ్చే అవకాశముంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వివాదాలకు దారి తీసేలా మాట్లాడవద్దు. ప్రతికూల ఆలోచనలను వీడండి. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికిస్తే గొడవలు రావు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని సందర్శిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటేనే మేలు. మీ ప్రతిభతో అందరిని మెప్పిస్తారు. మీ పరిధిలో మంచి పరిపాలన దక్షత కలవారిగా పేరు తెచ్చుకుంటారు. ఈ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకునేలా పని చేయాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మొండితనంతో మూర్ఖంగా వ్యవహరిస్తే మీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. అందరిని కలుపుకొని పొతే మంచి పేరు వస్తుంది. పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. దుర్గాదేవి ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ సహజ శైలిలో పనిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అనే సూత్రాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. సన్నిహితులతో, మిత్రులతో అవసరమైన మేరకు మాట్లాడితే మేలు. లేకుంటే గొడవలు వస్తాయి. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి అనువైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం ఉంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ అసందర్భ మాటల ద్వారా చిక్కుల్లో పడుతారు. తొందరపాటుతో పొరపాటుగా మాట్లాడి తర్వాత సంజాయిషీ ఇచ్చుకుంటారు. అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే ఈ సమస్య రాదు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. ఉద్యోగులు పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే గండాలు తొలగుతాయి.



మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. అవివాహితులకు మంచి సంబంధాలు వస్తాయి. వివాహం కూడా నిశ్చయమవుతుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ఉద్యోగస్తులకు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. జీతం కూడా పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.


కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పనులు సులభంగా సకాలంలో పూర్తవుతాయి. ఇంటా బయటా గొప్ప శుభ సమయం నడుస్తోంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు ఊహించని విధంగా గొప్ప శుభవార్తలను వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. అదృష్టం అందలం ఎక్కిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. గణపతి ప్రార్ధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. తగు విశ్రాంతి అవసరం. రోజువారీ తీరిక లేని పనుల నుంచి కొంత విరామం తీసుకుంటే మేలు. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళతారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. నవగ్రహ ధ్యానం శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details