తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది- ఇష్ట దేవతారాధన శుభకరం! - Daily Horoscope - DAILY HOROSCOPE

Horoscope Today 29th September 2024 : 2024 సెప్టెంబర్ 29వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 4:36 AM IST

Horoscope Today 29th September 2024 :2024 సెప్టెంబర్ 29వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఎవరి ఒత్తిడికీ లోనుకాకుండా నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది. ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి. సంతానం పట్ల కఠినంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అవసరానికి ధనం అందుతుంది. గురు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఊహించని విజయాలు సాధిస్తారు. పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. వృధా ఖర్చులు నివారించి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారం రంగాల వారు కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనుల్లో లాభాలు పొందవచ్చు. ఉద్యోగులు చిత్తశుద్ధితో కష్టించి పనిచేస్తే విజయం మీదే. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. మీ కోప స్వభావం కారణంగా సన్నిహితుల మధ్య అపార్థాలు, ఇరుగుపొరుగు వారితో గొడవలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త గా చెయ్యాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అపార్థాలతో మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో సాధించిన ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. ఉద్యోగస్థులు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాల వారు కీలక విషయాలలో ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. సమాజంలో కీరి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు జరుగుతుంది.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వేసే ప్రతీ అడుగు, చేసే ప్రతిపనీ శుభ ఫలితాలనిస్తుంది. ఉద్యోగస్థులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసి తిరుగులేని విజయాలను అందుకుంటారు. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం కూడా మంచిది కాదు. అహంకారం, గర్వం దరి చేరకుండా చూసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి దెబ్బ తింటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగత జీవితంలో అనేక శుభ ఫలితాలు ఉంటాయి. నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అన్ని రంగాల వారికి సౌభాగ్య సిద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటాయి. దైవబలంతో ఆర్థికంగా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇన్ని రోజులుగా మీరు అనుభవించిన ఆవేదన తొలగిపోయే సమయం వచ్చింది. మీ బాధను అందరితో పంచుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మంచి సమయం గడపడటం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో కొన్ని సవాళ్లు ఎదురైనా మనోబలంతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాలలో ఆత్మీయుల సలహా పాటించండి. అనవసర వివాదాల జోలికి పోవద్దు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా వేధించిన అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో నష్ట సూచన ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ ధ్యానంతో శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంగా పనిచేసి తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. మీ దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేముందు కుటుంబ సభ్యులు సలహా తీసుకోండి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే పెద్దలు సూచించిన మార్గంలో నడవడం ఉత్తమం. సంపద పెరుగుతుంది. సృజనాత్మకంగా వ్యవహరించి కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు తరచూ ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీరామనామ జపం శక్తినిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details