తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు సంకల్ప బలాన్ని నమ్ముకుంటే విజయం తథ్యం - శ్రీ లక్ష్మీదేవి ధ్యానం శుభకరం! - HOROSCOPE TODAY

అక్టోబర్ 27వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Horoscope
Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 4:51 AM IST

Horoscope Today 27th October 2024 : 2024 అక్టోబర్ 27వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి గత కొంత కాలంగా ఎదురవుతున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తిపరంగా శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. సంతానంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులు పెండింగ్ పనులను పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలవంతమైన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో, సృజనాత్మకతతో పనిచేసి అద్భుత విజయాలను సాధిస్తారు. మీ సామర్ధ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కీలకమైన వ్యవహారంలో సమయస్ఫూర్తితో పనిచేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ సహోద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ పక్కనే ఉంటూ మీకు వ్యతిరేకంగా పనిచేసేవారిని గుర్తించలేకపోతారు. వృత్తి పరంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారు. వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం సంకటంగా మారుతుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువ కావడంతో ఒత్తిడికి లోనవుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి స్ఫూర్తిని పొందుతారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. వృత్తి పరంగా చక్కని ప్రణాళికతో పనిచేసి అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు చేపట్టిన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి, వ్యాపారాలలో స్వబుద్ధితో, వేగంగా తీసుకునే నిర్ణయాలు ఫలవంతంగా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉండడంతో ఈ రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. ఏకాగ్రతతో పనిచేస్తే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో వాదనలు తగదు. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ విలువను గ్రహిస్తారు. కుటుంబ సభ్యులతో గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు. వాస్తవాలను గుర్తిస్తారు. వృత్తి పరంగా ప్రత్యర్థులు ఉంటేనే నిజమైన పురోగతి సాధిస్తామనే మాటను నమ్ముతారు. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వబుద్ధితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. చేతికి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఒకేసారి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఇలా వచ్చిన అవకాశాల నుంచి ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దైవబలం మీద విశ్వాసం ఉంచితే మంచి మార్గం దొరుకుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. వృత్తి, వ్యాపారాలలో సందర్భానుసారం నడుచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా వదంతులను దూరం పెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తారు. మీ వాక్చాతుర్యంతో, పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిపట్ల మీరు చూపే సంకల్పం, నిబద్ధత కారణంగా అందరూ మీకు పనులు అప్పజెప్పడంతో పనిభారం పెరుగుతుంది. తీరికలేని పని కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. న్యాయవివాదాలు, కోర్టు వ్యవహారాలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఆర్థికపరంగా నష్టాలు సంభవించవచ్చు. స్థిరాస్తి రంగాల వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి నష్టాలు భారీగా ఉంటాయి. నష్ట నివారణ కోసం అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యల కోసం అధిక ధన వ్యయం ఉండవచ్చు. కుటుంబ కలహాలు పరిష్కరించడంలో విఫలం అవుతారు. శనిస్తోత్ర పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త పనులు, ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. వృత్తి పరంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే పెద్దలు సూచించిన మార్గంలో నడవడం ఉత్తమం. సంపద పెరుగుతుంది. సృజనాత్మకంగా వ్యవహరించి కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో ఆటంకాలు ఉండవచ్చు. భాగస్వాములను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీరామనామ జపం శక్తినిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details