Horoscope Today 21st September 2024 :2024 సెప్టెంబర్ 21వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మీరు అతి దూకుడుతో, ఆధిపత్య ధోరణితో ఉంటారు. మీ దూకుడు లక్షణాన్ని కాస్తంత నియంత్రణలో ఉంచుకోవాలి. కొత్త ప్రయత్నాలు, పనులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొత్తవి ప్రయత్నించకపోవడమే మంచిది.
వృషభం (Taurus) :మీరు చేసే ప్రతి పనిలోనూ పరిపూర్ణత ఉండాలని భావిస్తారు. జీవితానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ మీరు దీన్ని ఆచరిస్తారు. మీ ప్రయత్నాలన్నీ సరైన దిశలో సాగేలా మీ శక్తియుక్తులను ఉయోగిస్తారు.
మిథునం (Gemini) :ఈ రోజు వ్యాపార, వ్యవహారాలకు గొప్పగా ఉంటుంది. మీరు పట్టింది అంతా బంగారం అవుతుంది. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. స్నేహితులు కూడా ప్రయోజనాలను తీసుకొస్తారు.
కర్కాటకం (Cancer) :మీ కుటుంబంలోని చిన్నవారిపై మీరు ఈ రోజు అధిక శ్రద్ధ పెడతారు. పిల్లలకు వారి రోజువారీ పనులు మెరుగుపరుచుకునే విషయంలో తగిన సూచనలిస్తారు. పోటీలు లేదా ప్రోగ్రాంల్లో పాల్గొంటారు.
సింహం (Leo) :ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. అంత అద్భుతంగా ఏమీ ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే, చిన్న చిన్న ఫలితాలు పొందడానికి కూడా మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. లేదా మీ మనస్సులో ఉన్న రూపం కాగితం పైన బదిలీ కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. తట్టుకొని నిలబడండి.
కన్య (Virgo) :బయటకు అందంగా కనిపించాలనే ఆలోచనలో మీరు ఉంటారు. దాని కోసం మీరు బ్యూటీ పార్లరుకు వెళ్లడం లేదా ఖరీదైన సౌందర్యపోషకాలు కొనుగోలు చేస్తారు. మీ రూపాన్ని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు.
తుల (Libra) :ఈ రోజు చాలా ముక్కు సూటిగా పనిచేస్తారు. మీ దూకుడు కాస్త తగ్గించుకోవాలి. లేదంటే అదృష్ట దేవత కూడా కాస్త వెనక్కి తగ్గుతుంది. వివాదాలు, సమస్యలకు మీరు దూరంగా ఉండాలి. సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio) :మీ కుటుంబ వాతావరణం ఈ రోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. మీ విరోధులు ఈ రోజు ఓటమిని అంగీకరిస్తారు. మీ సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. మీరు అసంపూర్ణంగా పనులను పూర్తిచేస్తారు. అనారోగ్యంగా ఉన్నవారందరికీ కొంత ఉపశమనం కలుగుతుంది.
ధనుస్సు (Sagittarius) :మీకు కలుగుతున్న అపజయాలకు కృంగిపోవద్దు. కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. మీరు మీ పిల్లల విషయంలో కొంత వ్యాకులపడే అవకాశం ఉంది. వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
మకరం (Capricorn) :ఈ రోజు మీకు చాలా బద్ధకంగా, నిరుత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆటంకాలు, అవరోధాలు ముందుకి వెళ్లకుండా ఆపుతాయి. ఏకాగ్రత చెదురుతుంది. జనం సహకారం ఉండదు. అయినా మీరు సహనం వహించాలి. జాగ్రత్తగా ఉండాలి. చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసరంగా బాధ పడడమే మిగులుతుంది.
కుంభం (Aquarius) : మిమ్మల్ని ఏదో బాధ వేధిస్తుంటుంది. దేని మీదా దృష్టి కేంద్రీకరించలేరు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. రక్త సంబంధీకులతో చిన్న పాటి మనస్పర్థలు రావచ్చు. దైవ ధ్యానం చేయడం మంచిది.
మీనం (Pisces) :ఈ రోజు మీరు కాస్త ఆవేశాన్ని అణుచుకోవాలి. లేకపోతే, మీ చుట్టు ప్రక్కలవారితో మీకు విరోధం వస్తుంది. మీరు మీ ఖర్చుని కాస్త అదుపులో పెట్టుకోండి. ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించండి. అవాంఛనీయమైన ఘటనలు చెలరేగి మీకూ, మీ బంధువులకూ మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.