తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు దూకుడు తగ్గించుకుంటే మంచిది- శివారాధన శ్రేయస్కరం! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today 16th September 2024 : 2024 సెప్టెంబర్ 16వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 2:30 AM IST

Horoscope Today 16th September 2024 : 2024 సెప్టెంబర్ 16వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంటుంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు దూకుడు తగ్గించుకుంటే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పరిష్కరించడం చాలా కఠినంగా ఉంటుంది. సహచరుల సహకారంతో సవాళ్లు ఎదుర్కొంటారు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. దూకుడు తగ్గించుకుంటే ఓ ముఖ్యమైన డీల్ సొంతం అవుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తిపరమైన వ్యవహారాల్లో సిద్ధాంతాలతో రాజీపడరు. సమాజంలో పేరొందిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉన్నటుంది. పనుల్లో ఆలస్యం, ఆటంకాల కారణంగా కోపావేశాలకు లోనవుతారు. యోగా ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. వ్యాపారంలో ఊహించని నష్టాలూ వచ్చే అవకాశముంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. విమర్శకుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. సమయానుకూలంగా నడుచుకుంటే వృత్తి వ్యాపారంలో విజయం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపారులకు ఆర్ధికంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. అనవసరపు వాదనలు, చర్చలకు దూరంగా ఉండండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఈశ్వర ఆరాధన శక్తినిస్తుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్ధిక లాభం, శత్రు జయం ఇలా ఎటు చూసినా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్, స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. సంతానం చదువు పట్ల ఆందోళనతో ఉంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచిరోజు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఆశించిన మేర ప్రయోజనాలు ఉండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ధననష్టం సూచితం. స్థిరాస్తి రంగం వారు రుణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.


ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గతంలో చేసిన పొరపాట్ల గురించి చింతిస్తుంటారు. గతాన్ని వీడి భవిష్యత్తుపై దృష్టి సారిస్తే మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడండి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. తొందరపడి కోపావేశంతో మాట్లాడిన మాటల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బ తింటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారాలలో అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్యం సహకరించదు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో నిష్పాక్షికంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో మీదైనా శైలితో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. మీ పోటీదారులపై విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. దైవానుగ్రహంతో ఈ రోజు ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నీ సమకూరుతాయి. ఈ సంతోషాన్ని సంపూర్ణంగా ఆనందించండి! స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలకు మంచి రోజు. ఈ రోజు ఏ పని చేసినా విజయం, ఆర్ధిక లాభాలు వెన్నంటే ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి ఈ రోజు చెప్పుకోతగిన శుభ ఫలితాలు ఉండకపోవచ్చు. మొహమాటాలకు పోయి చిక్కుల్లో పడతారు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారులు తీవ్రమైన పోటీ ఎదుర్కొంటారు. లాభాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ఇంకొంత కాలం వేచి చూడాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. గణపతి ప్రార్ధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details