Horoscope Today November 15th 2024 : నవంబర్ 15వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడు తగ్గిచుకుంటే మంచిది. ఆధిపత్య ధోరణి విడిచి పెట్టి అందరితో కలిసి పనిచేస్తే విజయం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎటు చూసినా సమస్యలు చుట్టుముట్టి ఉంటాయి కాబట్టి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొని నిగ్రహం పాటించాలి. దైవబలంతో సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు శుభకరంగా ఉంది. మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. ఈ రోజు వ్యాపారంలో గణనీయమైన లాభాలు ఉంటాయి. మీరు పట్టింది బంగారం అవుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో సంబంధ భాంధవ్యాలు మెరుగవుతాయి. ఓ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. గణపతి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. వృత్తి పరంగా శుభసమయం నడుస్తోంది. పదోన్నతులు, ఆదాయంలో వృద్ధి ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని అందరిని మెప్పిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ లక్ష్య సాధన కోసం పనిచేస్తారు. సహచరుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలకు ప్రణాళిక వేస్తారు. విదేశీ బంధువుల నుంచి అందిన వార్తలతో మనశ్శాంతి కొరవడుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు, పోటీ అశాంతికి కారణమవుతాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లోపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఖర్చులు పెరిగే సూచన ఉంది. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. గిట్టని వారి మాటలు పట్టించుకోవద్దు. ఈశ్వరుని ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. మీ విరోధులు ఈ రోజు తమ ఓటమిని అంగీకరిస్తారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు మీ వృత్తికి ఆటంకం కలిగించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ విశ్రాంతి తీసుకుంటే మంచిది. వ్యాపారులు ఊహించని నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరి కొంతకాలం ఎదురుచూడాలి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆర్థిక నష్టాలు, పని ఒత్తిడి కలిసి మీ రోజును కష్టతరం చేస్తాయి. కుటుంబ సభ్యులు సమస్యల్లో చిక్కుకోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. తీవ్రమైన పనిఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బ తింటుంది. కొన్ని అవమానకర సంఘటనలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. శనికి తైలాభిషేకం చేయించుకోవడం వలన ప్రతికూలతలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో గందరగోళంతో ఉంటారు. వ్యాపారంలో సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్లడం మంచిది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా ప్రమాదమే! ఆర్థిక సమస్యలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వివాదాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది. శత్రుభయం ఉంది. అభయ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తే ఆపదలు తొలగిపోతాయి.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల మనసును నొప్పించే విధంగా మాట్లాడడం మానుకుంటే మంచిది. వృత్తి పరంగా పురోగతి లోపిస్తుంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.