తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే- ఇష్ట దేవతారాధన శుభకరం! - DAILY HOROSCOPE

అక్టోబర్ 14వ తేదీ (సోమవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 3:13 AM IST

Horoscope Today 14th October 2024 : 2024 అక్టోబర్ 14వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా గొప్ప లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని శుభ సంఘటనలు జరుగుతాయి. కొత్తగా ఏర్పడే పరిచయాలు భవిష్యత్​లో మీ అభివృద్ధికి దోహదపడతాయి. సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉంటారు. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారంలో విజయాన్ని ఆశించవచ్చు. ఉదోగంలో అనుకూలత ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు పూర్తి అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు ఉండవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఏదో కోల్పోయినట్లు దిగులు, విచారంతో ఉంటారు. ఏ పని చేయాలన్నా ఉత్సాహం, ప్రోత్సాహం ఉండదు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా ఏర్పడిన ఆటంకాలు, సవాళ్లను ఈ రోజు మీరు విజయవంతంగా ఎదుర్కొంటారు. క్లిష్ట పరిస్థితి నుంచి విజయంతో తిరిగి రావడం మీ లక్ష్యంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యాల్లో ఈ రోజు మీరు తీవ్రమైన పోటీని ఎదుర్కొవాల్సి రావచ్చు. సన్నిహితుల సహకారంతో అన్ని ఆటంకాలను అధిగమిస్తారు. వ్యక్తిగత జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగ సహచరులతో, వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు ప్రశాంతంగా, ఓపికతో ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వేదన కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో అనవసరమైన, ప్రయోజనంలేని చర్చల్లో పాల్గొనకుండా ఉండటానికి ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఓ వ్యక్తి మీకు ఈ రోజు తారసపడతారు. ఆ వ్యక్తే మీ జీవితానికి అదృష్టంగా మారతారు. వ్యాపారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్భాటంగా కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మీరు చూపించే సామర్ధ్యం, కఠిన శ్రమ ప్రశంసలందుకుంటుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఈశ్వర ఆలయ సందర్శన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగులు పని పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా తమ పై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. తోటి ఉద్యోగుల సహకారం లోపిస్తుంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో విజయాలు ఆలస్యమవుతాయి. మీ కోపావేశాల కారణంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆంజనేయ దండకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ మాటల్లో జ్ఞానం, మీ నాయకత్వ లక్షణాలతో అందరిని ఒక్కతాటిపై నడిపిస్తారు. చేపట్టిన అన్ని పనుల్లో గొప్ప విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు హోదా పెరగడం, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. స్థాన చలనం సూచన ఉంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. అకౌంటెంట్లు, ఫ్రాంచైజీలు ఈ రోజు చక్కని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు తీవ్రమై పరిస్థితి అదుపు తప్పుతుంది. మానసికంగా బలహీనంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతారు. మౌనంగా, సహనంగా ఉండటం ద్వారా గమ్యాన్ని చేరుకోగలరు. పని ప్రదేశంలో ఎవరితోనూ ఘర్షణలు పెట్టుకోవద్దు. లేకుంటే ఆ ఘర్షణల ప్రభావం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. హనుమాన్ చాలీసా పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం (Capricorn) :మకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. వృత్తి పరంగా ఏర్పడిన పోటీని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్థుల ఆలోచనలను తల్లకిందులు చేసి మంచి విజయాలను సాధిస్తారు. ప్రతికూల పరిస్థితులలో ధైర్యంగా నిలబడి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. ఈ రాశి వారికి ఈ రోజు తారాబలం బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల సంపదలు కలిసి వస్తాయి. వ్యాపారులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈ రోజంతా గ్రహాలు ఉచ్చదశలో ఉన్నందున శారీరకంగానూ, మానసికంగానూ చాలా సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఈ రోజంతా ఆధ్యాత్మికంగా గడపడం మీకు ప్రశాంతతనిస్తుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా గడుస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. కుటుంబం పట్ల బాధ్యతతో ఉంటారు. దూర ప్రాంతాల నుంచి ఓ వార్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. స్నేహితుల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details