తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి అన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలే - జాగ్రత్తగా ఉంటే మంచిది! - DAILY HOROSCOPE

నవంబర్ 13వ తేదీ (బుధవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 1:47 AM IST

Horoscope Today November 13th 2024 : నవంబర్ 13వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. స్నేహితులతో వ్యాపారపరమైన చర్చలలో పాల్గొంటారు. ఏకాగ్రతతో చిత్తశుద్దితో పనిచేస్తే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులతో విందువినోదాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అపజయాలు రావడం వల్ల విచారంగా ఉంటారు. అనారోగ్యం కారణంగా ఈ రోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. వ్యయాలను అదుపులో ఉంచుకోండి, లేదంటే మీ పొదుపుకు గండిపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో గండాలు తొలగిపోతాయి.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీ సన్నిహితులతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. భవిష్యత్ గురించి ఆలోచనతో పొదుపు ప్రణాళికలు వేస్తారు. లాభదాయకమైన సంస్థలలో పెట్టుబడులు పెట్టడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్టం వరించి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. పిత్రార్జితం కలిసి వస్తుంది. శ్రేయోభిలాషుల మద్దతు మీ వైపు ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్ర, తీర్ధయాత్రకు ప్రణాళిక వేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లేకపోవడం చికాకు కలిగిస్తుంది. ప్రతికూల ఆలోచల కారణంగా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో గొడవలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర చర్చలకు దూరంగా ఉంటే మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే సన్నిహితులతో సంబంధాలు దెబ్బ తింటాయి. వ్యాపారస్థులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు కాదు. ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి గురవుతారు. ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నం చేస్తారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి పరమైన, వ్యాపార పరమైన చర్చల్లో మీ వాదనతో అందరినీ మెప్పిస్తారు. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సామాజికంగా కీర్తి, గౌరవం పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధనతో మేలు జరుగుతుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెట్టడానికి మంచి రోజు. ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సూర్య ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అండతో అన్ని కష్టాలను అధిగమిస్తారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు మానసిక అశాంతికి కారణమవుతాయి. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ధార్మిక కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. గత కొంతకాలంగా పెండింగులో ఉన్న లీగల్ వ్యవహారాలు సెటిల్ చేసుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు ఉంటాయి. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఏ పని చేపట్టిన విజయం వెన్నంటే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలకమైన వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికపరమైన మోసాలకు గురి అయ్యే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఈశ్వరుని ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details