తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మహాశివరాత్రి నాడు - వీటిని తప్పక దానం చేయాలి - మీకు తెలుసా?

Maha Shivaratri: మహా శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున శివుడి భక్తులంతా ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు, జాగరణలతో ఈశ్వరుడి సన్నిధిలో గడుపుతారు. అయితే శివరాత్రి రోజున కొన్ని వస్తువుల దానం చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని పండితులు అంటున్నారు. అవేంటో మీకు తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 11:45 AM IST

Maha Shivaratri
Maha Shivaratri

Donate These Things on Maha Shivaratri:శివరాత్రి రోజున "హరహర మహాదేవ శంభో శంకర.." అంటూ దేశంలోని శివాలయాలన్నీ శివ నామస్మరణతో మార్మోగుతాయి. భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో ఊగిపోతుంటారు. ఈ రోజున శివుడి భక్తులంతా ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు, జాగరణలతో ఆ ఈశ్వరుడి సన్నిధిలోనే గడుపుతారు. అయితే.. శివరాత్రి రోజున కొన్ని వస్తువులు దానం చేస్తే.. ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది? :తెలుగు సంవత్సరాది ప్రకారం మహా శివరాత్రిని మాఘ మాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. అయితే.. శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండడం ప్రధానం.. అందుకే మహా శివరాత్రిని మార్చి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈరోజున దానం చేసే కొన్ని ఆహార పదార్థాల ద్వారా.. మీ జీవితంలోకి అదృష్టం వస్తుందని చెబుతున్నారు. ఆ పదార్థాలు ఏంటంటే..

నెయ్యి:మహా శివరాత్రి రోజున శివ లింగాన్ని నెయ్యితో అభిషేకిస్తే.. శివుడు ప్రసన్నడవుతాడని, కోరిన కోర్కెలు నెరవేర్చుతాడని అంటున్నారు. అయితే.. శివుడికి అభిషేకం చేయడంతోపాటు పేదలకు కూడా నెయ్యిని దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలు పరిష్కారమవడమే కాకుండా ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.

మహా శివరాత్రి ఎప్పుడు? - ముహూర్తం, ఉపవాసం ప్రాముఖ్యత!

పాలు:మహా శివరాత్రి సందర్భంగా శివుడికి పాలతో అభిషేకం చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని పండితులు అంటున్నారు. అలాగే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివలింగంపై పాలు పోయడం వల్ల.. జాతకంలో బలహీనపడిన చంద్రుడిని బలోపేతం చేసుకోవచ్చని అంటున్నారు. ఇది భక్తునికి మానసిక ప్రశాంతత ఇస్తుందని చెబుతున్నారు.

నల్ల నువ్వులు:మహా శివరాత్రి నాడు శివునికి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడం పూర్వీకులకు ప్రీతికరమైనదని విశ్వాసం. ఇది పితృ దోషాన్ని తొలగిస్తుందని చెబుతున్నారు. అలాగే నువ్వులను దానం చేయడం వల్ల చాలా కాలంగా అమలుకు నోచుకోని పనులు పూర్తవుతాయని అంటున్నారు.

వస్త్ర దానం:మహా శివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలోని ఆర్థిక సమస్యలు తీరుతాయని పండితులు అంటున్నారు. భక్తులకు శివుని అనుగ్రహం కలగడం వల్ల.. ఇంట్లో ఆదాయం పెరిగి, అప్పులు తీరిపోతాయని చెబుతున్నారు. వీటితోపాటు పంచదార, తేనె, బిల్వ పత్రం, చందనం కూడా శివునికి సమర్పించి.. దానం చేయాలని సూచిస్తున్నారు.

మహాశివరాత్రి నాడు శివుడిని ఈ పూలతో పూజిస్తే - అష్టైశ్వర్యాలు కలుగుతాయట!

ABOUT THE AUTHOR

...view details