Do Not See These Things After Wakeup as per Vastu:ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని పనులు చేయకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అద్దం:ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు చాాలా మందికి ఉంటుంది. అలాగే.. జుట్టు దువ్వుకునే అలవాటు కూడా ఉంటుంది. ఈ రెండు అలవాట్లు మానుకుంటే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల అరిష్టం వస్తుందని, పొద్దున్నే జుట్టు దువ్వడం దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుందని, ఇది ఏ మాత్రం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి పూజ గదిని సందర్శించిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకోవాలని, జుట్టు దువ్వుకోవాలని సూచిస్తున్నారు.
గోడ గడియారాలు:చాలా మంది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంట్లో గోడ గడియారాలను చూస్తూ ఉంటారు. టైమ్ ఎంతయిందో తెలుసుకోవడం కోసం చేసే ఈ పని మంచిదే అయినప్పటికీ.. పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలను చూడటం అశుభ సూచకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పాడైపోయిన గడియారాలను ఎట్టి పరిస్థితులలోనూ చూడకుండా ఉండాలి. ఒకవేళ అలా చూస్తే అది మనకు చెడు జరిగేలా చేస్తుందని చెబుతున్నారు.
పెయింటింగ్స్: చాలా మంది ఇంటి అలంకరణలో భాగంగా పలు రకాల పెయింటింగ్స్ గోడకు తగిలిస్తుంటారు. అలాంటి వాటిలో అడవి జంతువులు, యుద్ధానికి సంబంధించినవి, హింసాత్మక ఘటనలను ప్రేరేపించే ఫొటోలు ఉంటాయి. అయితే నిద్ర లేచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చూడకుడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు.