తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఇంట్లో రెండు వంట గదులు ఉండొచ్చా? - వాస్తు నిపుణుల సమాధానమిదే! - Is Two Kitchens are Good in Duplex - IS TWO KITCHENS ARE GOOD IN DUPLEX

Two Kitchens in Duplex House: మీరు డూప్లెక్స్​ హౌజ్​ కట్టుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అందులో రెండు కిచెన్​లు నిర్మించాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఇది. వాస్తు ప్రకారం డూప్లెక్స్​ హౌజ్​లో రెండు కిచెన్​లు నిర్మిస్తే ఏం జరుగుతుందో వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Two Kitchens in Duplex House
Two Kitchens in Duplex House (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 4:46 PM IST

Updated : May 20, 2024, 5:03 PM IST

Is Two Kitchens are Good in Duplex House:సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకోసం డబ్బులు పొదుపు చేసి తమ కలను నెరవేర్చుకుంటారు. అయితే.. సొంతింటి విషయంలో చాలా మంది చాలా రకాలుగా కలలు కంటుంటారు. కొద్దిమంది చిన్న ఇంటితో సరిపెట్టుకుంటే.. మరికొద్దిమంది మళ్లీ మళ్లీ కట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో పెద్దదే కట్టుకుంటారు. అయితే.. ప్రస్తుతం చాలా మంది డూప్లెక్స్​ హౌజ్​ నిర్మాణాలపై వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే డూప్లెక్స్​ ఇంట్లో కూడా రెండు కిచెన్​లను​ నిర్మిస్తున్నారు. మరి వాస్తు ప్రకారం ఇలా నిర్మించవచ్చా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..

డూప్లెక్స్ హౌస్ అంటే.. రెండు లివింగ్ యూనిట్లు ఒకదానికొకటి జతచేయబడిన ఒక రకమైన నివాస గృహం. ఈ ఇల్లు రెండు అంతస్తులను కలిగి ఉంటుంది. అందులో ఒకటి గ్రౌండ్ ఫ్లోర్‌గా, మరొకటి ఫస్ట్​ ఫ్లోర్​గా ఉంటుంది. డూప్లెక్స్ ఇంట్లో ఒక వంటగదితో పాటు ఒక భోజనాల గది ఉంటుంది. డూప్లెక్స్ హౌస్​లో అంతస్తులు ఇంటి మధ్యలోని మెట్ల ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇంత వరకు బాగానే ఉన్నా చాలా మంది డూప్లెక్స్​ హౌజ్​ నిర్మాణం వరకు వాస్తు నియమాలు పాటించి.. కిచెన్​ విషయంలో మాత్రం దాన్ని పక్కకు పెడతారు. తమకు నచ్చినట్టు రెండు కిచెన్​లు ఏర్పాటు చేసుకుంటారు. అయితే వాస్తు ప్రకారం డూప్లెక్స్​ హౌజ్​లో రెండు కిచెన్​లో ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా? - వాస్తు ఏం చెబుతోంది! - What to Do Dead Person Belongings

ఎందుకంటే.. వంట గది ఇంటి మొత్తానికీ ఒక ప్రాధాన్యత గల స్థానం. కాబట్టి.. దానిని ప్యాంట్రీల పేరుతో ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేయడం సరైంది కాదని అంటున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో ఒక కిచెన్‌ మాత్రమే ఉండాలని.. అదీ ఆగ్నేయం లేదా వాయవ్యంలోనే ఉండాలని చెబుతున్నారు. ఆగ్నేయంలోనే రెండు గదులు చేసి, ‘డ్రై కిచెన్‌, వెట్‌ కిచెన్‌ అని వాడుకోవచ్చంటున్నారు. అయితే, ఆ రెండు కలిసి ఆగ్నేయ స్థానంలోనే ఉండాలని సూచిస్తున్నారు.

ఇక ఇంటిని విభజిస్తేనే రెండు కిచెన్‌లు పెట్టుకోవచ్చంటున్నారు. డూప్లెక్స్‌ ఇల్లు అంటే.. అది ఒక ఇల్లుగానే పరిగణించాల్సి ఉంటుందని.. ఒకవేళ పైన కూడా ఒక కిచెన్‌ అవసరం అనుకుంటే.. కింది కిచెన్‌ మీదనే ఆగ్నేయంలో అమర్చుకోవచ్చని అంటున్నారు. ఒకవేళ కింద కిచెన్​ వాయవ్యంలో ఉంటే.. పైన కూడా వాయవ్యంలోనే పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

రెండు కిచెన్​లు ఉంటే ఏం జరుగుతుంది:

అనారోగ్యం:వాస్తు ప్రకారం, అగ్ని అనేది శక్తి, జీవశక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ క్రమంలో రెండు కిచెన్​లు ఒకే ఇంట్లో ఉండటం వల్ల కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవుతారని అంటున్నారు.

కుటుంబ కలహాలు:వాస్తు ప్రకారం, వంటగది అనేది ఇంట్లో శ్రేయస్సు, సామరస్యానికి కేంద్రం. రెండు వంటగదులు ఒకే ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, కలహాలకు దారితీస్తుందని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కాంపౌండ్ వాల్‌ను గుండ్రంగా నిర్మించుకోవచ్చా? వాస్తు ఏం చెబుతుంది! - Vastu Rules For Home

ఇంటి ప్రహరీ గోడ కన్నా గేటు ఎత్తుగా ఉండొచ్చా? - వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది? - Vastu Rules For House Gate

Last Updated : May 20, 2024, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details