తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

ETV Bharat / spiritual

శరన్నవరాత్రుల వేళ "అఖండ దీపం" వెలిగిస్తున్నారా? - ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదట! - Akhanda Deepam Rules in Navratri

Akhanda Deepam: దేవీ నవరాత్రుల కోసం యావత్​ దేశం సిద్ధమైంది. అక్టోబర్​ 3 నుంచి అక్టోబర్​ 12వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. శరన్నవరాత్రుల నేపథ్యంలో చాలా మంది అఖండ దీపం వెలిగిస్తుంటారు. అయితే ఈ దీపం వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Akhanda Deepam
Akhanda Deepam Rules in Navratri 2024 (ETV Bharat)

Akhanda Deepam Rules in Navratri 2024: హిందూ సంప్రదాయంలో దేవతామూర్తులను ఆరాధించే సమయంలో జ్యోతిని వెలిగిస్తారు. కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నవరాత్రులు వంటివి నిర్వహించినప్పుడు కచ్చితంగా అఖండ దీపం వెలిగిస్తారు. ఇలా వెలిగిస్తేనే తప్ప పారాయణం లేదా ఆరాధన పూర్తి కాదనదేని చాలా మంది నమ్మకం. ఇక శరన్నవరాత్రులు వేళ కూడా అఖండ దీపం వెలిగిస్తుంటారు. అయితే ఈ దీపం వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అఖండ దీపం అంటే ఏమిటి:కష్టాలు తొలగిపోవాలన్నా, జీవితంలో తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి తీరాలన్నా.. అఖండ దీపం వెలిగిస్తే మంచిదని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఇక అఖండ దీపం అంటే.. కనీసం 24 గంటల పాటు దీపం కొండెక్కకుండా వెలిగితే దానిని అఖండ దీపం అంటారని అంటున్నారు.

ఎలా వెలిగించాలి:

  • ముందుగా ఇత్తడి పళ్లెం తీసుకుని అందులో బియ్యం లేదా ధాన్యం పోయాలి.
  • ఆ తర్వాత పెద్ద సైజ్​లో ఇత్తడి లేదా మట్టి మూకుడుని తీసుకోవాలి.
  • ఆ తర్వాత మూకుడుని పళ్లెంలోని బియ్యం మీద ఉంచాలి.
  • ఆ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి, పువ్వులతో అలకరించుకోవాలి.
  • ఆ మూకుడులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోయాలి.
  • ఆ తర్వాత లావు పాటి వత్తి వేసి దీపాన్ని వెలిగించాలి.
  • అఖండ దీపం వెలిగించిన వెంటనే ఆ దీపం వద్ద కొబ్బరికాయ కొట్టాలని చెబుతున్నారు.
  • దీపం వద్ద నైవేద్యం పెట్టాలి. నైవేద్యంగా పేలాలు, బియ్యం, పటిక బెల్లం వీటిలో ఏ ఒక్కటి పెట్టినా లేదా మూడు పెట్టినా మంచిదే.
  • ఇంట్లో అమ్మవారి విగ్రహం, ఫొటో వద్ద ఈ దీపాన్ని పెట్టవచ్చని సూచిస్తున్నారు. ఆగ్నేయ మూలలో వెలిగించినా మంచిదని చెబుతున్నారు.

దిక్కులను బట్టి ఫలితం: అఖండ దీపంలో వత్తి వెలిగే దిక్కును బట్టి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఆ దిక్కులు చూస్తే..

  • ఇంట్లో శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా, పెద్దలకు గౌరవం లభించాలన్నా వత్తి తూర్పువైపు వెలిగేలా చూసుకోవాలంటున్నారు.
  • ధన పరంగా కలిసి రావడానికి, ఆదాయ మార్గాలు పెరగడానికి, అప్పులు తీరడానికి, వృథా ఖర్చులు తగ్గిపోవడానికి, మొండి బకాయిలు వసూలు కావడానికి అఖండ దీపంలోని వత్తి ఉత్తరం వైపు వెలిగేలా చూసుకోవాలంటున్నారు.

నవరాత్రి స్పెషల్ : అమ్మవారు మెచ్చే "నువ్వులన్నం" - ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి!

అఖండ దీపం వెలిగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:అఖండ దీపం వెలిగించిన తర్వాత ఓ మనిషి ఆ దీపాన్ని గమనిస్తూ ఉండాలి. మీరు ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నారో.. అన్ని రోజులూ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. నూనె సరిపడినంతా ఉందో, లేదో చూసుకోవాలి. నూనె తక్కువవుతున్నా.. వత్తి తగ్గుతూ వస్తున్నా చూసుకుని జాగ్రత్తపడాలి.

24 గంటల ముందే దీపం కొండెక్కితే ఏం చేయాలి: ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అఖండ దీపం కొండెక్కితే చాలా మంది అశుభంగా భావించి ఆందోళన చెందుతుంటారు. ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతుంటారు. అయితే అనుకున్న సమయానికి ముందే అఖండ దీపం కొండెక్కితే భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు మాచిరాజు కిరణ్​ కుమార్. అలాంటి సమయంలో ఇలా చేస్తే మంచిదంటున్నారు. అదేంటంటే..

అఖండ దీపం కొండెక్కితే.. మళ్లీ మూకుడులో నూనె లేదా నెయ్యి పోసి మరో వత్తిని వేసి దీపం పెట్టి ఆ సమయం నుంచి 24 గంటల వరకు వత్తి నిరంతరం వెలిగేలా చూసుకోమంటున్నారు. ఇలా నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని, అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

నవరాత్రుల వేళ అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి? - పూజకు ఏ పువ్వులు వాడకూడదు?

'దేవీ నవరాత్రుల వేళ ఉపవాసం ఉంటున్నారా? - అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి'!

"దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి? - ఏ విధంగా ఆరాధిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి??" -

ABOUT THE AUTHOR

...view details