ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఓట్ల కోసం జగనన్న హామీలిస్తాడు - అమలు మాత్రం చేయడు: వైఎస్ షర్మిల - రాహుల్ గాంధీ ప్రధాని

YS Sharmila Fire on PM Modi: కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వస్తుందని, రాహుల్‌ గాంధీ తొలి సంతకం దీనిపైనే చేస్తారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. తిరుపతి ఎస్వీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హోదాపై జగన్ మడమతిప్పారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హోదా కోసం ఆరాట పడే వాళ్ళ మధ్య, హోదాను తాకట్టు పెట్టిన వారికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు.

YS_Sharmila_Fire_on_PM_Modi
YS_Sharmila_Fire_on_PM_Modi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 7:50 PM IST

Updated : Mar 1, 2024, 9:32 PM IST

ఓట్ల కోసం జగనన్న హామీలిస్తాడు - అమలు మాత్రం చేయడు: వైఎస్ షర్మిల

YS Sharmila Fire on PM Modi :కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదాపై తొలి సంతకం చేస్తామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీయూ తారకరామ మైదానంలో నిర్వహించిన న్యాయసాధన సభలో ఆమె పాల్గొన్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఇదే వేదిక పై ప్రత్యేకహోదా ఇస్తానన్న ప్రధాని మోదీ మాట తప్పారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామని, ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు.

తిరుపతిలో ఇదే మైదానంలో ప్రధాని మోదీ 2014 లో ప్రత్యేకహోదా హామీ ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గుర్తు చేశారు. ఓట్ల కోసం ప్రత్యేకహోదా వాగ్దానం చేసి, రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజల హక్కులో ఏ ఒక్కటైనా పది సంవత్సరాలలో సాధించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలకపక్షం, ప్రతిపక్షం రెండు బీజేపీకి దాసోహమయ్యాయని ఎద్దేవా చేశారు. మూడు నామాల వాడి సాక్షిగా ఇచ్చిన హామీలకు పంగనామాలు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలన్న జగన్‍ ఒకటైనా నిర్మించారా అని ప్రశ్నించారు.

అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు- ఆశావహులతో షర్మిల ముఖాముఖి

జగనన్న మోదీ వ్యాపారి? : ప్రత్యేకహోదా ఇవ్వకుండా పదేళ్లుగా తల్లి ఆంధ్రాను మోదీ చంపుతూనే ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా సంజీవని అన్న చంద్రబాబు ఏమి చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్న జగన్ ఏమయ్యాడని, మూకుమ్మడి కాదు కదా ఒక్కరు కూడా రాజీనామా చేయలేదన్నారు. పులి అన్న జగన్ ఏమయ్యాడని ఎద్దేవా చేశారు. మోదీ చెప్పిన ప్రతి వ్యాపారికి జగనన్న అన్ని చేశాడని ఆరోపించారు. ప్రత్యేక హోదా గురించి ఒక ఎంపీ అయినా మాట్లాడారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రత్యేక హోదాతో పాటు వైఎస్సార్ సంక్షేమ పాలన :రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న జగన్‍ ఏమి చేశాడని షర్మిల ప్రశ్నించారు. 23 వేల టీచర్ పోస్టులు ఉన్నా 6 వేల పోస్ట్​లతో దగా డీఎస్సీ వేసి యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మద్యం అమ్ముతోందని ఆరోపించారు. ఏదైనా ఓట్ల కోసమే జగనన్న హామీ ఇస్తాడని, వాటిని అమలు చేయరని మండిపడ్డారు. కాంగ్రెస్​లో తాను చేరింది విభజన హామీల సాధన కోసమేనని, హోదా కోసం ఆరాట పడే వాళ్ళ మధ్య, హోదాను తాకట్టు పెట్టిన వారికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు.

వైఎస్సార్సీపీ, టీడీపీలు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టాయి: షర్మిల

మోసం అంటే మోదీ - మోదీ అంటే మోసం :అది రాష్ట్ర ప్రజల హక్కు అని, తిరుపతిలో ఇదే మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక హామీలు ఇచ్చారని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేశారు. అద్భుతమైన రాజధాని కడతామన్నారు. రాష్ట్రాన్ని హార్డ్‌వేర్‌ హబ్‌ చేస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం కట్టిస్తామన్నారని, పీలో అద్భుతమైన రాజధాని కడతామని మోదీ హామీ ఇచ్చారని, రాష్ట్రాన్ని హార్డ్‌వేర్ హబ్‌ చేస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చారని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం కట్టిస్తామని తెలిపారు. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రం పదేళ్లుగా మన రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం అంటే మోదీ, మోదీ అంటే మోసం అని అన్నారు. ప్రత్యేక హోదా లేక రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, దక్షిణాదిలో మెట్రోరైల్‌ లేని రాష్ట్రం ఏపీ మాత్రమే అని తెలిపారు. హోదా వల్ల ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌కు వేల పరిశ్రమలు వచ్చాయని, అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.

అధికారంలోకి రాగానే జగన్ సాగిల పడ్డారు :పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే కనీసం రాజధాని కూడా లేని దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నేతగా కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌ అధికారంలోకి రాగానే సాగిల పడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఇది ప్రత్యేక హోదా కోసం ఆరాటపడే వారికి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య పోరాటమని ఎద్దేవా చేశారు.

చెల్లి అని చూడకుండా దూషిస్తున్నారు - జగన్​పై షర్మిల ఆగ్రహం

Last Updated : Mar 1, 2024, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details