ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"హాయ్ రఘురామ- హలో జగన్"- అసెంబ్లీలో ఆసక్తికరంగా ఆ ఇద్దరి సంభాషణ - ys jagan raghu rama conversation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 12:35 PM IST

Updated : Jul 22, 2024, 5:41 PM IST

YS Jagan and Raghu Rama Conversation: అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్, ఉండి ఎమ్మెల్యే రఘురామ మధ్య సంభాషణ జరిగింది. దీంతో జగన్‌, రఘురామ ఏం మాట్లాడుకున్నారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే రఘు రామ కృష్ణరాజు జగన్ వద్దకు వెళ్లి పలకరించారు.

YS Jagan and Raghu Rama Conversation
YS Jagan and Raghu Rama Conversation (ETV Bharat)

YS Jagan and Raghu Rama Conversation: ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిరోజు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అధికారంలో ఉన్నన్నాళ్లు నలుపు రంగు అంటేనే పడని మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాలకు నల్ల కండువాతో హాజరయ్యారు. అదే విధంగా ఉప్పు, నిప్పులా ఉండే జగన్​, టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఒకరినొకరు పలకరించుకోవడం శాసన సభలో ఆసక్తికరమైన దృశ్యంగా నిలచింది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మధ్య అసెంబ్లీ హాల్​లో జరిగిన సంభాషణ తోటి ఎమ్మెల్యేలను ఆశ్చర్యపరచింది. ఈ ఘటనను ఎమ్మెల్యే రఘురామ మీడియాతో పంచుకున్నాడు. జగన్ తన భుజంపై రెండు సార్లు చేయి వేసి మాట్లాడారని ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అన్నారు. కనిపించిన వెంటనే 'హాయ్' అని జగన్ పలకరించారని తెలిపారు.

'అదే నాకు చివరి రోజు అవుతుందనుకున్నా'- నాటి భయానక అనుభవంపై రఘురామ - RRR Interview

రోజూ అసెంబ్లీకి రావాలని ఆయన్ని కోరానని రఘురామ తెలిపారు. "రెగ్యులర్​గా వస్తాను, మీరే చూస్తారుగా" అని జగన్ చెప్పారని అన్నారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్​ను రఘురామ కృష్ణ రాజు కోరారు. తప్పని సరిగా అంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ లాబీలోకి నవ్వుకుంటూ వెళ్లారు. ఈ మేరకు జగన్​తో జరిగిన సంభాషణ వివరాలను రఘురామ కృష్ణంరాజు మీడియాతో పంచుకున్నారు.

గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా విజయం సాధించిన రఘురామ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్​పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, జగన్‌ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఈ క్రమంలో రఘురామకృష్ణ అరెస్ట్‌ తదితర పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత కూడా రఘురామ వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయన్ను అరెస్టు చేయించిన జగన్​ ప్రభుత్వం పోలీస్​ కస్టడీలో తీవ్రస్థాయిలో వేధించింది. తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేయడం విదితమే. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జగన్​ పై నమోదైన తొలి కేసు కూడా రఘురామ ఫిర్యాదు తోనే కావడం గమనార్హం.

చంద్రబాబు విజనరీ నాయకుడు - ఏపీ అభివృద్ధికి తీవ్రంగా కృషిచేశారు: గవర్నర్ - Governor Speech in AP Assembly

మీడియా వల్లే బతికాను - గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురామ - Mla Raghu Rama Raju Met Guntur SP

Last Updated : Jul 22, 2024, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details