ETV Bharat / state

ఆంధ్రలో పడవల పోటీలు - ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

మత్స్య సంపదను వేటాడేందుకు బలుసుతిప్పలో పడవల పోటీ - ఒక్కొక్క పడవపై నాలుగు కుటుంబాలకు చెందినవారు

Boat Racing in Mummidivaram
Boat Racing in Mummidivaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2024, 1:18 PM IST

Updated : Nov 4, 2024, 4:00 PM IST

Boat Racing in Mummidivaram : గోదావరి నదీపాయల్లో మత్స్య సంపదను వేటాడాలంటే మత్స్యకారులు కొన్ని హద్దులను ఏర్పాటు చేసుకుంటారు. నిర్దేశించిన ప్రాంతంలో చేపల వేట సాగించాలంటే ఎవరైనా పోటీలో పాల్గొని నెగ్గాల్సిందే. ఇందుకోసం పడవల పోటీలను నిర్వహిస్తారు. ముందుగా వారు ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి వరకు వేటసాగించేందుకు అర్హులుగా నిర్ధారిస్తారు. అంతకుమించి పై ప్రాంతంలో వేట సాగించకుండా నిషేధం విధిస్తారు. మరి ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పడవల పోటీలను నిర్వహించారు. ఇది ఏదో సరదా పోటీ అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఈ పోటీలు మత్స్యకారుల జీవనోపాధికి దారి చూపే పోటీలు. అదేంటో తెలుసుకుందాం. ముమ్మిడివరం నియోజవర్గం పరిధిలో గౌతమీ గోదావరి, వృద్ధ గౌతమి గోదావరి పాయలు ప్రవహిస్తాయి. వీటిని మత్స్య సంపదను వేటాడేందుకు బలుసుతిప్పలో పడవల పోటీలను ఏర్పాటు చేశారు.

పందెం గెలిస్తేనే మనుగడ! - జీవితాలను మలుపుతిప్పే బలుసుతిప్ప పడవల పోటీలు (ETV Bharat)

Balusuthippa Boat Racing : ఇందులో సుమారు 40 పడవుల్లో మత్స్యకారులు తమ వేట స్థలాల కోసం పోటీపడ్డారు. యానం, పిల్లంక, మసకపల్లి, పోలవరం, కుండలేశ్వరం తదితర ప్రాంతాల వరకు గోదావరిలో పోటీ సాగింది. ఒక్కొక్క పడవపై నాలుగు కుటుంబాలకు చెందిన వారు ఉంటారు. ముందుగా వారు ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి వరకు వేటసాగించేందుకు అర్హులుగా గుర్తిస్తారు. అంతకుమించి పై ప్రాంతంలో వేట సాగించకుండా నిషేధం విధిస్తారు.

గతంలో ఈ వేట విషయంలో మత్య్సకారుల మధ్య గొడవలు జరిగి గ్రామాలపై దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం గ్రామ కమిటీలు వేసి పోలీసుల సమక్షంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పోటీలు నిర్వహించి హద్దులను కేటాయించింది. ఈ పద్ధతి అందరికీ ఆమోదయోగ్యం కావడంతో ఇప్పటికీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ పోటీలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.

గౌతమీ గోదావరి తీరంలో ఆకట్టుకున్న పడవల విన్యాసాలు

Boat races in prakasam: సంక్రాంతి వేళ.. హోరాహోరీగా పడవల పోటీలు

Last Updated : Nov 4, 2024, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.