ETV Bharat / state

అప్పుడు పెద్దలు చెప్పినదానికల్లా తలూపారు - ఇప్పుడేమో చల్లగా జారుకున్నారు - IRS RAMAKRISHNA IRREGULARITIES

రామకృష్ణపై అభియోగాల నమోదుకు రెవెన్యూశాఖ ఆదేశం

IRS Ramakrishna Irregularities
IRS Ramakrishna Irregularities (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 9:27 AM IST

Allegations in IRS Ramakrishna : గత ఐదేళ్లలో కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి వైఎస్సార్సీపీ పాపాల్లో భాగం పంచుకున్న అధికారుల్లో మరొకరు జారుకున్నారు. ఐఆర్‌ఎస్‌ అధికారి రామకృష్ణ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీగా అప్పట్లో ఆ విభాగమంతా తన సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించారు. అప్పటి పెద్దలు చెప్పినదానికల్లా తలూపి రిజిస్ట్రేషన్ల శాఖలో ఆయన చేసిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలుండటంతో కూటమి ప్రభుత్వం రామకృష్ణకి పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టింది.

ఈ-స్టాంపింగ్‌ విధానం ప్రవేశపెట్టడంలోనూ రామకృష్ణ అవకతవకలకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో విజిలెన్స్‌ విచారణ జరిపించింది. విధి నిర్వహణలో ఆయన చేసిన అవకతవకలపై అభియోగాలు నమోదు చేయాల్సిందిగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇవన్నీ కొనసాగుతుండగానే రామకృష్ణ దర్జాగా మాతృశాఖకు వెళ్లిపోయారు. దిల్లీలో రిపోర్ట్ కూడా చేశారు.

IRS Ramakrishna Irregularities : ఆస్తుల క్రయవిక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కి ఎప్పటి నుంచో నాన్‌-జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల విధానం అమల్లో ఉంది. దీనికి స్వస్తి పలికి దాని స్థానంలో ఈ-స్టాంపింగ్‌ విధానాన్ని వైఎస్సార్సీపీ సర్కార్‌ ప్రవేశపెట్టడంలో రామకృష్ణదే కీలకపాత్రనే ఆరోపణలున్నాయి. ఈ విధానం అమలుకు స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారి నుంచి వసూలు చేసే ఫీజుల మొత్తాన్ని అదే రోజు కాకుండా మర్నాడు జమ చేసేలా స్టాక్‌హోల్డింగ్‌ కార్పొరేషన్‌కు వెసులుబాటు కల్పించారు. అది ప్రభుత్వానికి నష్టదాయకమని ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.

కార్డ్‌-2.0 పేరుతో ఖజానాకు గండి : ఇక కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఎన్​ఐసీని పక్కనపెట్టి రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన కార్డ్‌-2.0 సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన బాధ్యతను క్రిటికల్‌ రివర్‌ అనే సంస్థకు అప్పగించడంలోనూ రామకృష్ణదే కీలకపాత్ర అని ఆరోపణలున్నాయి. కార్డ్‌-2.0ని కూడా తామే చేసిస్తామని ఎన్‌ఐసీ చెప్పినా పెడచెవినపెట్టి, క్రిటికల్‌ రివర్‌కు రూ.35 కోట్ల కాంట్రాక్ట్‌ కట్టబెట్టారు. టెండర్‌ నిబంధనల్ని ఆ సంస్థకు అనుకూలంగా రూపొందించారన్న ఆరోపణలున్నాయి.

ఇక పేదలకు గత ప్రభుత్వాలిచ్చిన ఎసైన్డ్‌ భూములు వైఎస్సార్సీపీ పెద్దల పరమయ్యేలా హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేయడంలోనూ రామకృష్ణ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సుమారు 26,000ల ఎకరాల ఎసైన్డ్, చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దానిలో వైఎస్సార్సీపీ నేతలకు వేల కోట్ల ప్రయోజనం చేకూరిందన్న ఆరోపణలున్నాయి. ఇంతజరిగనా సంబంధిత శాఖల అధికారులు కళ్లప్పగించి చూశారే తప్ప అక్రమాలకు బాధ్యుణ్ని చేసే గట్టి ప్రయత్నం చేయకపోవడం విస్తుగొలుపుతోంది.

రూ.2600కోట్ల ఇసుక కుంభకోణంలో పెద్దల ప్రమేయం - 'క్లూ' రాబట్టిన పోలీసులు! - Venkata Reddy ACB Custody Inquiry

వెంకటరెడ్డిపై సస్పెన్షన్​ వేటు - ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశం - APMDC EX MD Venkata Reddy Suspend

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.