వైఎస్ షర్మిల సభలో వైసీపీ మూకల అలజడి - మీరు సిద్ధమైతే మేము కూడా సిద్ధమంటూ సవాల్ YCP Activists Rioted in YS Sharmila Sabha in Kurnool District:వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్ర కర్నూలు జిల్లా ఆదోనిలో జరుగుతోంది. ఈ క్రమంలో ఆదోనిలో షర్మిల నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ మూకలు అలజడి సృష్టించారు. వైసీపీ సిద్ధం జెండాలు పట్టుకుని సభను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మీరు సిద్ధం అయితే మేము సిద్ధం అంటూ షర్మిల సవాలు విసిరారు. మిమ్మల్ని గద్దె దించడానికి సిద్ధం ఇంటికి పంపడానికి మేము సిద్ధం అంటూ ధీటుగా సమాధానం చెప్పారు.
జనాలు లేక వెలవెల బోయిన జగన్ బస్సుయాత్ర - ఎండలోనే కొద్దిపాటి జనం - CM Jagan Bus Yatra
మా సభలను అడ్డుకోవాలని సిద్ధం జెండాలు పట్టుకుని వస్తున్నారు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేయడానికి సిద్ధమా లైక హామీలు ఇచ్చి మోసం చేయడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి మేము సిద్ధం అవుతామని అన్నారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవని లాంటిదని ఆ హోదా వచ్చి ఉంటే రాష్ట్ర భవిష్యత్తు మరోలా ఉండేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వచ్చేవని అన్నారు.
చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ఎర్రచందనం కేసులు - పెద్దారెడ్డిపై క్రిమినల్ కేసులు - Cases on YSRCP MLA Candidates
కేసుల భయంతోనే సీఎం జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలోని భాజపాకు భయపడి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. శంకుస్థాపనలు చేయడం తప్ప జగన్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. వేదావతి ప్రాజెక్టు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు హామీలను విస్మరించి రైతులను ముంచేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల అన్నారు.
200 ఇచ్చినా, పెట్రోలు కూపన్లు పంచినా - జగన్ యాత్రకు 'సిద్ధం'గా లేని జనం - Memantha Siddham Bus Yatra Failed
రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎమ్మెల్యేకు కమిషన్ ఇవ్వాలి :ఈ సభలో ఆదోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రమేష్ యాదవ్ పేరును ప్రకటించిన షర్మిల. వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కోటి రూపాయలుపైన రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎమ్మెల్యేకు కమిషన్ ఇవ్వాలి కదా, పేకాట కింగ్, గుండా అంటూ పలు విమర్శలు చేశారు. ఈ ఎమ్మెల్యే అరాచకాలు మితిమీరిపోయాయి అవి తగ్గాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అంటూ సూచించారు. సీఎం జగన్ చేసిన హామీలు స్పెషల్ స్టేటస్, డీఎస్సీ, 3 కాపీటల్స్ అనే పేర్లను మద్యం సీసాలకు పెట్టి తన వాగ్దానాలు పూర్తి చేసాడని ఎద్దేవా చేశారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వైఎస్ షర్మిల తెలిపారు.