ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే! ఎవరీ 'ఉషా చిలుకూరి', స్వస్థలం ఎక్కడంటే? - Usha Chilukuri Hometown

ఆమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్డ్ ఓల్డ్ పార్టీ- రిపబ్లికన్స్ గెలిస్తే అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడిగా ఓ తెలుగింటి అల్లుడు ఎన్నిక కానున్నారు. అదే తెలుగింటమ్మాయి సెకండ్ లేడీ -రెండో మహిళగా చరిత్రలో నిలుస్తారు.

జేడీ వాన్స్‌ ఉషా చిలుకూరి దంపతులు
జేడీ వాన్స్‌ ఉషా చిలుకూరి దంపతులు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 10:40 AM IST

Updated : Jul 16, 2024, 11:14 AM IST

JD vance and Usha Chilukuri : అమెరికా అధ‌్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్..తన తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్‌, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్‌ను ఎంపిక చేశారు.
39సంవత్సరాల జేడీ వాన్స్‌ ఓ తెలుగు మూలాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా రెండో మహిళ చరిత్రలో నిలిచిపోతారు.మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ట్రంప్ పై హత్యాప్రయత్నం వెనుక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండవచ్చునని ట్వీట్ చేసిన రిపబ్లికన్ సెనేటర్ వాన్స్.

జేడీ వాన్స్‌ ఉషా చిలుకూరి దంపతులు (ETV Bharat)
ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా జెడి వాన్స్‌ను అభివర్ణించారు. కానీ ఇప్పుడు వాన్స్‌యేట్రంప్ కి అత్యంత ఇష్టమైన అనుచరుడిగా మద్రపడ్డారు. వాన్స్‌తో పాటు ఆయన భార్య ఉషా చిలుకూరి గతంలో డెమెక్రటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ళ కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్ ఉషా చిలుకూరి పనిచేస్తున్నారు. ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోఉన్నాయి.
జేడీ వాన్స్‌ ఉషా చిలుకూరి దంపతులు (ETV Bharat)

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్​ నామినేట్

  • ఎవరీ ఉషా చిలుకూరి? ఏమా వివరాలంటే!
  • జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్షుడిగా ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి రెండు మూడు గంటలుగా గూగుల్‌లో ఇదే పేరు హోరెత్తుతోంది. అసలు ఎవరీ వాన్స్‌, వాన్స్‌కు తెలుగు మూలాలేంటి? ఆమె సతీమణి ఉషది ఎక్కడ అన్న ప్రశ్నలే గూగుల్ సెర్చ్‌లో ఉన్నాయి. వాస్తవానికి ఉషా చిలుకూరి భారతీయ వలసదారుల దంపతుల అమ్మాయి.
  • ఆమె తల్లిదండ్రులు చాలా వేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా కూడా కాలిఫోర్నియాలోనే జన్మించారు.
  • ఉషా చిలుకూరి తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామం.
    ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
  • ప్రస్తుతం ఉషా చిలుకూరి వయసు 38 ఏళ్లు
  • ఉషా చిలుకూరి-జేడీ వాన్స్‌ దంపతులకు ముగ్గురు సంతానం
  • ఆధునిక చరిత్ర ఉషకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో బీఏ చేశారు.
  • కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్రలో ఎంఫిల్ పట్టా పొందారు.
  • యేల్ వర్శిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్ - ఉషా చిలుకూరి ప్రేమించుకున్నారు. ఆ పరిచయమే పెళ్లి వరకు చేరింది.
  • ఎంఫిల్ పూర్తవగానే 2018లో అమెరికా సుప్రీం కోర్ట్‌కు లా క్లర్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలోని ముంగెర్, టోల్లెస్, ఓల్సన్‌లో పనిచేశారు.
  • కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసే- సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. వ్యాపారం మొదలు కుటుంబ సమస్యల వరకు వివిధ రంగాలకు చెందిన అప్పీళ్లను కొలిక్కితేవడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది.
  • జేడీ వాన్స్‌తో ఉషా చిలుకూరి 2014లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాలిఫోర్నియాలో హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగింది.
  • జేడీ వాన్స్‌ రాజకీయ ప్రయాణంలో ఉషా చిలుకూరి ఓ అదృశ్యశక్తి. ఓ పక్క కుటుంబాన్నీ మరోపక్క ముగ్గురు పిల్లల్ని చూసుకుంటున్న ఉష మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణం.

ట్రంప్​కు CT స్కాన్

Last Updated : Jul 16, 2024, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details