Tollywood Hero Nikhil Siddharth Joined in TDP : 'హ్యాపీడేస్' సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ దేశంలో ఎన్నికల పండుగ జోరుగా సాగుతున్న తరుణంలో రాజకీయ పార్టీ అయిన పసుపు కండువా కప్పుకొని అందరకీ ఆశ్చర్యాన్ని కలిగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.
"మీ అందరి ఆశీస్సులు మామయ్యకు కావాలి" :టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్‌కు ఆయన దగ్గరి బంధువు. కొండయ్య యాదవ్‌కు నిఖిల్ అల్లుడు వరుస అవుతారు. పార్టీలో చేరిన సందర్భంగా నిఖిల్ ట్విటర్ వేదికగా స్పందించారు. "చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందినందుకు మావయ్య ఎమ్ఎమ్ కొండయ్య యాదవ్‌కు అభినందనలు అలాగే ధన్యవాదాలు. మా కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని, మీ అందరి ఆశీస్సులు మామయ్యకు కావాలి." అని కోరారు. దీంతో నారా లోకేశ్‌తో నిఖిల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిలకలూరిపేటలో వైసీపీ ఖాళీ - మాజీ ఇన్‌ఛార్జితో పాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ సహా కౌన్సిలర్లు టీడీపీలో చేరిక - YCP WIPED OUT IN CHILAKALURIPETA
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? :నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తరచూ సామాజిక బాధ్యతతో సమస్యలపై పోస్టులతో స్పందిస్తుంటారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో టీడీపీ అభిమానులు, శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య యాదవ్‌కు అండగా ఎన్నికల ప్రచారంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదో ఎదురు చూడాలి మరీ?
మే 13న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూలదోస్తారు- జగన్ నాటకాలు హాలీవుడ్‌నే తలదన్నేలా ఉన్నాయి: చంద్రబాబు - Chandrababu Election Campaign
స్వయంభూ సినిమా షూటింగ్లో బిజీ :హ్యాపీడేస్ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన నిఖిల్ సిద్దార్ధ్ ప్రస్తుతం స్వయంభూ సినిమా (Swayambhu Movie) షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన కార్తికేయ - 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో కార్తికేయ-2, 18 పేజెస్, స్పై సినిమాలతో ప్రేక్షకులను ఆలరించారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా స్వామి రా రా, కార్తికేయ, వంటి చిత్రాలతో ఆయన నటించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలు - TDP 42nd Foundation Day