ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

చిత్తూరులో ఉద్రిక్తత- పసుపు రంగు బల్లల తొలగింపుపై టీడీపీ ఆగ్రహం - చిత్తూరులో ఉద్రిక్తత

Tension in Chittoor: ఇళ్లూ, గుళ్లూ, బడులు అనే తేడా లేకుండా వైఎస్సార్సీపీ జెండా రంగులతో ముంచెత్తుతున్నా పట్టించుకోని అధికారులు.. ప్రజలకు ఉపయోగపడేందుకు ఏర్పాటు చేసిన బల్లలు పసుపు రంగులో ఉన్నాయని తొలగించారు. దీంతో చిత్తూరులో ఉద్రిక్తత నెలకొంది.

Tension_in_Chittoor
Tension_in_Chittoor

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 8:18 AM IST

Updated : Jan 31, 2024, 9:47 AM IST

చిత్తూరులో ఉద్రిక్తత- పసుపు రంగు బల్లల తొలగింపుపై టీడీపీ ఆగ్రహం

Tension in Chittoor: పసుపు రంగు వైఎస్సార్సీపీ నేతలకే కాదు వారికి వత్తాసు పలుకుతున్న అధికారులకూ కంటగింపుగా మారింది. అమ్మ పెట్టాపెట్టదు.. అడుక్కునీ తిన్నవ్వదన్నట్లు.. పార్కుల వద్ద ప్రజలు సేదతీరేందుకు తగిన ఏర్పాట్లు చేయని అధికార యంత్రాంగం.. దాతలు ఏర్పాటు చేసిన బల్లలు మాత్రం విరిచిపడేసింది. దీనికి కారణమేంటంటే ఆ బల్లలు పసుపు రంగులో ఉండటమే. ఓ పార్టీకి చెందిన రంగులున్నాయని వాటిని తొలగించడంతో చిత్తూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

గుడివాడలో పోటాపోటీ ఫ్లెక్సీలు- 'సిద్ధం' అంటున్న వైఎస్సార్సీపీ, 'సై' అంటున్న టీడీపీ

చిత్తూరు నగరంలో పలు ప్రాంతాల్లో చెట్ల నీడన ప్రజలు కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో.. స్థానిక తెలుగుదేశం నేత జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలోని జీజేఎమ్ ఛారిటబుల్ ట్రస్ట్‌ సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసింది. కట్టమంచి చెరువు కట్టపైనా కొన్ని బల్లలు వేశారు. వీటిని నగరపాలక సంస్థ అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు.

'ఇన్‌ఛార్జి'ల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎంవో కు క్యూ కట్టిన నేతలు

ప్రజలకు ఉపయోగపడేందుకు ఏర్పాటు చేసిన బల్లలు ఎందుకు తొలగిస్తున్నారని తెలుగుదేశం నాయకులు ప్రశ్నించగా.. అధికారులు చెప్పిన సమాధానం విని వారు అవాక్కయ్యారు. బల్లలు పసుపు రంగులో ఉండటంతోనే తొలగిస్తున్నామని చెప్పారు. ఇళ్లూ, గుళ్లూ, బడులు అనే తేడా లేకుండా వైఎస్సార్సీపీ జెండా రంగులతో ముంచెత్తుతున్నా పట్టించుకోని అధికారులు.. ప్రజలకు ఉపయోగపడేందుకు ఏర్పాటు చేసిన బల్లలు తొలగించడంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారా లోకేశ్​తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భేటీ - మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు

బల్లల తొలగింపు క్రమంలో తెలుగుదేశం శ్రేణులు అడ్డుకోవడంతో.. అక్కడికి వచ్చిన చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి వారిపై పరుషపదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా ఓ వ్యక్తిపైనా చేయిచేసుకోవడంతో స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత నగరపాలక సంస్థ కమిషనర్ వచ్చి బల్లల ఏర్పాటుకు అనుమతి తీసుకోలేదని.. అందుకే తొలగిస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు.

నేటితో ముగిసిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్టే గడువు

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు ఘటనా స్థలికి వచ్చి.. అధికారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. చివరికి అధికారులు అక్కడి నుంచి బల్లల్ని తరలించారు. పార్కుల వద్ద ప్రజలు సేదతీరేందుకు తగిన ఏర్పాట్లు చేయని అధికార యంత్రాంగం.. దాతలు ఏర్పాటు చేసిన బల్లలను విరిచిపడేయటంపై స్థానికులు మండిపడుతున్నారు. అమ్మా పెట్టకా.. అడుక్కునీ తిన్నయ్యకా అన్నట్లు ఉంది అధికారుల తీరు అని విమర్శిస్తున్నారు.

రసవత్తరంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ రాజకీయం-బాలినేనికి అధిష్టానం షాక్?

Last Updated : Jan 31, 2024, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details