ఓటు హక్కును వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు - అందరూ వేయాలని పిలుపు (ETV BHARAT) Political Leaders Cast Their Votes in Hyderabad :హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రామ్‌నగర్‌లోని జేవీ హైస్కూల్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ భార్య వసంత, కూమార్తె విజయలక్ష్మితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలక్‌పేట సలీంనగర్ పరిధిలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దంపతులు ఓటు వేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ గ్రౌండ్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఓటు వేశారు. అంబర్‌పేట పరిధిలోని బర్కత్‌పురాలో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి అభ్యర్థి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మోండా మార్కెట్‌లోని ఇస్లామీయ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈస్ట్ మారేడుపల్లిలోని కస్తూరిబా గాంధీ కళాశాలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటు వేశారు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎస్ఎస్కే డిగ్రీ కళాశాలలోని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేతలు కోరారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ - ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థులు - Telangana MP Candidates Cast Votes
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత మహేంద్ర హిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాస్త్రీపురంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామంలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. చేవెళ్ల మండలం గొల్లపల్లిలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. మేడ్చల్ మండల పాడూరు గ్రామ జెట్పీహెచ్ఎస్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటు వేశారు.
హబ్సిగూడా శ్రీసాయి పబ్లిక్ స్కూల్‌లో మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గౌలిగూడా వాల్మీకి సమాజ్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్‌లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దంపతులు ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సికింద్రాబాద్ సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్‌లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణ పోల్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే - TOLLYWOOD CELEBRATIES VOTES IN TS
ఓటర్లు అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ నందినగర్‌లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీహాల్‌లో సతీమణి శైలిమ, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెంట్రల్ నర్సరీలో డీజీపీ రవి గుప్తా, ఎస్సార్‌నగర్‌లో సీఈఓ వికాస్‌రాజ్, మాదాపూర్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఓటు వేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సి.పార్థసారథి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. శక్తివంతమైన ఓటు ఆయుధాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఉదయ్‌నగర్ సెయింట్ ఆగస్టీన్ స్కూల్ పోలీంగ్ బూత్‌లో తన సతీమణితో కలిసి ఓటు వేశారు.
ఇట్స్ పోలింగ్ డే - వేలికి సిరా చుక్క అంటించుకున్న సినీ తారలు వీళ్లే - Telugu Celebrities Casted Vote