తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఈ నెల 12న కేబినెట్​ సమావేశం - పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు! - Telangana Cabinet Meeting 2024

Telangana Cabinet Meeting On March 12th 2024 : రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 12న సచివాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశం సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. పలు కీలక నిర్ణయాలు ఈ భేటీలో తీసుకోనున్నారు.

Telangana Cabinet Meeting on March 12th
Telangana Cabinet Meeting

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 7:07 PM IST

Telangana Cabinet Meeting On March 12th 2024 :రాష్ట్ర మంత్రిమండలి ఈనెల 12న భేటీ కానుంది. సచివాలయంలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు రూ.2,500 పథకంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు, నారాయణపేట-కొడంగల్​ ఎత్తిపోతల పథకాలను ఆమోదించనున్నట్లు సమాచారం.

ఈ నెల 13న లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ రావచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గం పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మేడిగడ్డ కుంగిబాటుపై విజిలెన్స్​ సిఫార్సుల మేరకు క్రిమినల్​ కేసుల నమోదు లేదా విశ్రాంతి జడ్జిలతో విచారణ అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details