TDP MLC CANDIDATES:ఆంధ్రప్రదేశ్లో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కృష్ణా-గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్లని చంద్రబాబు ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు.
వ్యూహంపై దిశానిర్దేశం: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎన్డీఏ శ్రేణులు సమావేశం అయ్యారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించేలా కూటమి శ్రేణులు కృషి చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.