TDP Legislative Meeting : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. శాసనసభ సమావేశాల్లో మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అప్పుల ఊబిలో రాష్ట్రం, సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు వేల ఎకరాలు కేటాయింపుపై ప్రధానంగా చర్చించనున్నారు.
అక్రమ రాయితీలు, విద్యుత్ ఛార్జీల బాదుడు, స్థానిక సంస్థల నిధులు దారి మళ్లింపు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన భూమి కేటాయించకపోవడం అంశాలపై చర్చలు జరగనున్నాయి. కరవు మండలాల ప్రకటనలో ప్రభుత్వ వైఫల్యం, మిచౌంగ్ తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యం, ఇసుక, బెరైటీస్ గనుల్లో గోల్ మాల్, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అప్పగించడంలో ప్రభుత్వం వైఫల్యంపై చర్చించనున్నారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం, రాష్ట్రం నుంచి పరిశ్రమల్ని వెళ్లగొట్టడం, పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చలు జరపాలని తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున, అభ్యర్థిని నిలబెట్టే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఉద్యోగాల భర్తీపై జగన్ ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు - నాది విజన్, జగన్‌ది పాయిజన్: చంద్రబాబు