TDP leaders met Ongolu MP Magunta : ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఆయన నివాసంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధ్వర్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జీలు మాగుంట ఇంటికి ఉదయాన్నే చేరుకున్నారు. సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ఇన్‌చార్జీలు బీఎన్ విజయ్‌కుమార్, ఎరిక్షిన్ బాబు, అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీ మాగుంట తో పాటు, ఆయన తనయుడు రాఘవ రెడ్డి కూడా భేటీ అయ్యారు. త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మాగుంట చేరబోతున్నారనే ప్రచారం ఉంది. మంచి ముహూర్తం చూసుకొని ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో మాగుంట, తెలుగుదేశం పార్టీ నాయకుల భేటీ ఆసక్తికరంగా మారింది.
'మా కుటుంబ గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటున్నా- వైసీపీకి రాజీనామా చేస్తున్నా'
తాను త్వరలో తెలుగుదేశం పార్టీ లో చేరబోతున్నట్టు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) ఇటీవల రాజీనామా చేసిన ఆయన తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు ఈరోజు మాగుంట ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి లైన విజయ్ కుమార్, ఎరిక్షన్ బాబు(Eriction Babu) , నారాయణరెడ్డి అశోక్ రెడ్డి తోపాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ సత్య, మాగుంట కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వీరంతా కలిసి అల్పాహారం తీసుకుని రాజకీయ భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. అనంతరం మాగుంట తో పాటు తెలుగుదేశం నాయకులు మీడియాతో మాట్లాడారు.