TDP Leader Pattabhi Ram Allageations:సీఎం నివాసానికి వెళ్లిన కంటైనర్ ద్వారా నోట్ల కట్టలు తరలించారని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు కొనుగోలు కోసం డబ్బు తరలింపు కంటైనర్ ద్వారా జరిగిందని ధ్వజమెత్తారు. వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల డబ్బు పంపిణీ కోసం ఆర్టీసీ వాహనాలను వాడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ క్యాష్ స్మగ్లింగ్ కోసం ఆర్టీసీని వాడుకుంటోందని మండిపడ్డారు.
నిన్న సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కంటైనర్ తాలూకూ సీసీ టీవీ ఫుటేజ్ మొత్తం ఆర్టీసీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ ఘటన మరువక ముందే సీఎం ఇంటి వద్ద మరో కంటైనర్ కలకలం రేపిందని విమర్శించారు. సీఎం నివాసంలోకి నేరుగా కంటైనర్ వెళ్లటం ఇంతవరకు చూడలేదని, ఈ రోజు మధ్యాహ్నం 1గంటకు అదే కంటైనర్ విజయవాడ బస్ స్టాండ్ వద్దకు వచ్చిందన్నారు. కరెన్సీ కట్టలతో నిండిన అట్టపెట్టల్ని ఆ కంటైనర్ నుంచి దింపి డిపో క్లర్క్ చాంబర్ లో డబ్బు లెక్కపెడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కంటైనర్ వ్యవహారం పై ఈసీ జోక్యం చేసుకుని సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నాలుగు రోజులుగా ఒకేచోట ఉన్న సంధ్య ఆక్వా బస్సులో తనిఖీలు- ఫైల్స్, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం - CHECKINGS IN SANDHYA AQUA BUS
సీఎం నివాసంలోకి కంటైనర్ ఎందుకు వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ బస్సు యాత్ర కోసం కిచెన్ కంటైనర్ అంటున్నారు, కంటైనర్‌లో వంటపాత్రలు వెళ్లాయని చెబుతున్నారని పేర్కొన్నారు. నిన్న తిరుపతి జిల్లాలో 53 రకాల వస్తువులతో డంప్ బయటపడిందని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో కరెన్సీ డంప్‌లు కూడా ఉన్నాయని లోకేశ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టీసీకి చెందిన వాహనంపై పోలీసు స్టిక్కర్ అంటించి పంపారని పేర్కొన్నారు. అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు నింపి సీఎంవో నుంచి బయటకు పంపారని ఆరోపించారు. అట్టపెట్టెల్లో కొన్ని రూ.కోట్లు ఉన్నాయని పట్టాభి ఆరోపించారు.
విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు నోట్ల కట్టలు పంపిస్తారని పట్టాభిరామ్ తెలిపారు. ఆర్టీసీ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బును సీఎంవోలో దాచారని తెలిపారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్లు కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీకి నిజాయతీ ఉంటే విజయవాడ బస్టాండ్‌కు వెళ్లి తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. వాహనంలో ఏం తరలిస్తున్నారో ఆర్టీసీ యాజమాన్యం వివరణ ఇవ్వాలని పట్టాభి కోరారు. సీఎంవో నుంచి వచ్చిన కంటైనర్‌పై లోతైన విచారణ జరపాలని తెలిపారు.
సరకు పాడవుతుందనా - ఏమైనా చేస్తారనా ? - కంటైనర్ భద్రతపై సీబీఐ దృష్టి - VIZAG PORT DRUGS CONTAINER SAFETY