Chandrababu Fire on CM Jagan : బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతేంటి ? జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌మోహన్‌రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పటి వరకు బటన్ నొక్కి జనంపై ఎంత భారం వేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. బటన్ నొక్కుతున్నానని గొప్పలు చెప్పుకొంటున్న జగన్, కరెంట్ ఛార్జీలు పెంచి రూ. 64 వేల కోట్ల భారం మోపాడని, జగన్ బటన్ నొక్కితేనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని, జగన్ బటన్ పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకు?: చంద్రబాబు
రాష్ట్రం గెలవాలి : ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసమేనని, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో చూడలేదని, సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్ లేదని చెప్పారు. జగన్ బటన్ నొక్కుడుతో ప్రజలకు ఎంతో కష్టం వచ్చింది, ఒక్కో కుటుంబం రూ. 8 లక్షలు నష్టపోయిందని తెలిపారు. జగన్ జాబ్ క్యాలెండర్‌కు ఎందుకు బటన్ నొక్కలేదు? మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు ? సీపీఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు ? అని ప్రశ్నించిన చంద్రబాబు, జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు. జగన్‌ది ఉత్తుత్తి బటన్ అని జనం గమనించాలని కోరారు.
జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ భేటీలో ఛార్జ్‌షీట్' విడుదల చేసిన చంద్రబాబు
జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం :వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు, ఎన్ని వారాలైంది ? రోడ్ల బాగు కోసం బటన్ ఎందుకు నొక్కలేదు ? రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు బటన్ ఎందుకు నొక్కలేదు, డీఎస్సీ కోసం ఇన్నాళ్లూ ఎందుకు బటన్ నొక్కలేదు ? అని చంద్రబాబు దుయ్యబట్టారు. మైనింగ్ బటన్ నొక్కి భూగర్భ సంపద దోచేశాడు, ఇసుక బటన్ నొక్కి తాడేపల్లికి సంపద తరలించాడు, జగన్ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయాయి, రేపు ప్రజలంతా ఒకే బటన్ నొక్కుతారు, ప్రజలు నొక్కే బటన్‌తో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం అని అన్నారు. ధనదాహంతో జగన్ ఉత్తరాంధ్రను ఊడ్చేశాడు, రుషికొండను అనకొండలా మింగేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు, సాక్షి పేపర్‌కు మాత్రం రూ.1000 కోట్లు కట్టబెట్టి, సలహాదారుల పేరిట వందల కోట్లు దోచిపెట్టారని, ఒక్క సజ్జలకే రూ.150 కోట్లు దోచి పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.