TTD Who initiated Action Against Non-Hindu Employees: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు చేపట్టింది. గతేడాది నవంబరు 18న బోర్డు సమావేశంలో తీర్మానం మేరకు అన్యమతస్తులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూమతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మందిని గుర్తించారు.
1989 ఎండోమెంట్ యాక్ట్ మేరకు హిందూమత సంప్రదాయాలను అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొందిన వీరి అన్యమతాలను అనుసరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీయడంతో పాటు భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న వీరిపై ఈవో క్రమశిక్షణ చర్యలకు అదేశించారు. అన్యమతాలను అనుసరిస్తున్న ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధుల్లో నియమించవద్దని అదేశించారు.