TDP Janasena BJP Seat Sharing in Rajya Sabha ByPolls 2024 :వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Konidela Nagababu in Rajya Sabha Race :ప్రస్తుతం కూటమిగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన రాజ్యసభ సభ్యుల విషయంలో పంపకాలు ఏ విధంగా జరగుతాయని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. శాసనసభ, లోక్‌సభలో అధిక బలం ఉన్న టీడీపీకి, అలాగే మిత్రపక్షమైన జనసేనకి రాజ్యసభలో ప్రాతినిథ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నికతో రాజ్యసభలో మరోసారి అడుగు పెట్టాలని టీడీపీ, మొదటి సారి ఎంట్రీ ఇవ్వాలని జనసేన ఆలోచన చేస్తుంది. అలాగే బీజేపీ కూడా ఏపీ నుంచి ఒకర్ని పెద్దల సభకు పంపించాలని అనుకుంటుందని సమాచారం. 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీకి, ఒకటి జనసేనకు ఇస్తారా లేక మూడు పార్టీలు ఒక్కొక్క సీటును పంచుకుంటారా అని ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో ఎన్టీయే నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. వైఎస్సార్సీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఈ ఎన్నికలో పోటీ చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - ఏపీలో ఖాళీలు ఇవే
జనసేన నుంచి నాగబాబు :టీడీపీ నుంచి ఆశావహుల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఈ లిస్ట్‌లో ముఖ్యంగా వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీకి, ఆ పార్టీకి రాజీనామా చేసిన బీద మస్తాన్‌రావు టీడీపీలో చేశారు. ఒక స్థానం ఆయనకు కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అలాగే టీడీపీ నుంచి కిలారు రాజేష్, సానా సతీష్, టీడీ జనార్దన్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, కనకమేడల రవీంద్ర కుమార్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, వర్ల రామయ్య, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఇలా చాలా మంది నేతలు పోటీలో ఉన్నారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్ అన్న నాగబాబు, లింగమనేని రమేష్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
వంగవీటి రాధకు భంగపాటు తప్పదా? :జనసేన నుంచి నాగబాబు ఒకే అయితే కుల ప్రాతిపదికన టీడీపీ నుంచి రేసులో ఉన్న సానా సతీష్, వంగవీటి రాధకు భంగపాటు తప్పదు. జనసేన పీఏసీ, కార్పోరేషన్ చైర్మన్ కూడా కాపుకి ఇచ్చారు. ఈ కోణంలో అన్నీ ఓకే సామాజిక వర్గం ఇబ్బంది అనుకుంటే లింగమనేని రమేష్‌కి ఇచ్చి, నాగబాబుకి తరువాత వచ్చే ఫుల్ టైమ్ రాజ్యసభ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడికి 20 నెలలు పదవి మాత్రమే. మూడింటిలో ఒకటి బీదా మస్తాన్‌కి రెన్యువల్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. మిగిలిన రెండులో ఒకటి జనసేన ఒకటి టీడీపీ లేక ఒకటి బీజేపీ ఇంకోటి టీడీపీ తేలాల్సి ఉంది. ఒకవేళ జనసేన, బీజేపీ చెరొకటి తీసుకుంటే టీడీపీ నుంచి ఇక బీదా మస్తాన్ ఒక్కరే.
Rajya Sabha Election Schedule :ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. మొత్తం 4 రాష్ట్రాల్లోని 6 ఖాళీలకు ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బంగాల్, హరియాణా రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఉపఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10వ తేదీ తుదిగడువుగా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించింది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 13 తుదిగడువుగా తెలిపారు. డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం షెడ్యూల్లో పేర్కొంది. అదేరోజు ఓట్లను లెక్కిస్తారు.
వైఎస్సార్సీపీకి షాక్ - రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా - ఆమోదం - Krishnaiah resigned to Rajya Sabha
వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా - ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్ - YSRCP MPs Resign