TDP chief Chandrababu assured : అన్ని వర్గాలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ 2-3 సెంట్ల భూమి, టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు, ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వడంతో పాటు సాగునీటిపై శ్రద్ధ పెడతామని తెలిపారు. హంద్రీనీవా నీళ్లు తీసుకువచ్చి సాగునీరు అందిస్తామని, డ్రిప్ ఇరిగేషన్‌కు రాయితీలు ఇచ్చి ఆదుకుంటామని, డోన్ ప్రాంతాన్ని అరటి తోటల హబ్‌గా మారుస్తామని చెప్పారు.
డోన్‌లో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. చెల్లికి ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వ్యక్తి, తల్లికి అన్నం పెట్టని వ్యక్తి ప్రజలకు కావాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని, మైనింగ్‌లో కోట్లు దిగమించి ప్రజలకు పిచ్చుకగూళ్లు కట్టారని మండిపడ్డారు. కర్ణాటక నుంచి మద్యం యథేచ్ఛగా తరలిస్తున్నారని, రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తూ జే బ్రాండ్లను పూర్తిగా రద్దు చేయించడంతోపాటు దోచుకున్న డబ్బులను కక్కించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.
ఇంటింటికీ వెళ్లి పింఛన్ ఇవ్వాలి- కుట్రలు, కుతంత్రాల్లో అధికారుల భాగస్వామ్యం దురదృష్టకరం: చంద్రబాబు - pension distribution
దిల్లీ మద్యం స్కామ్ కంటే రాష్ట్రంలో మద్యం స్కామ్ పెద్దదన్న చంద్రబాబు మద్యం ధరలు పెరిగాయని, రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ యువతను నిర్వీర్యం చేసిందని, దుర్మార్గుడి ధనదాహానికి ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోయాయని ధ్వజమెత్తారు. జలగ మాదిరిగా రక్తాన్ని తాగడమే జగన్ పని అని విమర్శించారు.
వైఎస్సార్సీపీ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే తాము ఐటీ ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ రూ.5 వేలు జీతం వచ్చే పని ఇచ్చిందని, తాము లక్ష రూపాయల జీతం వచ్చే ఉపాధి కల్పించామని గర్వంగా ప్రకటించారు. దుర్మార్గ పాలన వస్తే రివర్స్ పీఆర్‌సీ వేస్తారని, టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని గుర్తు చేశారు. ఉద్యోగుల వేతనాలు రూ.25 వేల కోట్లు బకాయి పెట్టారన్న చంద్రబాబు పీఆర్‌సీ ఇచ్చి ఉద్యోగులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు భద్రత, సరైన పీఆర్‌సీ ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. సంపద సృష్టించి ఉద్యోగులను ఆదుకుంటామని చెప్పారు.
కూటమి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్ - హాజరుకానున్న ముఖ్యనేతలు - TDP JANASENA BJP MANIFESTO
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్న చంద్రబాబు అమరావతిని ఎవరు నాశనం చేశారు అని నిలదీశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి, అన్ని కులాలు, వర్గాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, తన జీవితం బీసీలకు అంకితమని చెప్పారు. బీసీలే నా ప్రాణం, ఊపిరి.. బీసీలకు రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి బీసీలను పైకి తెస్తామని, స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు ఖర్చు పెడతామని అన్నారు. చేతివృత్తులను కాపాడి సామాజిక న్యాయం చేస్తాని వెల్లడించారు. దుర్మార్గులు వస్తే వ్యాపారులు ప్రతినెలా కప్పం కట్టాల్సి వస్తుందని గుర్తు చేస్తూ మీ కోసం కాదు.. వారి కోసం వ్యాపారాలు చేయాల్సి వస్తోందని వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.
మహాశక్తి కింద నాలుగు రకాల కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, తల్లికి వందనం కింద రూ.15 వేలు అందజేస్తామన్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలను లక్షాధికారులను చేస్తామన్న చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందించి ఆడబిడ్డలను ప్రతి ఇంటికి ఆర్థికమంత్రిగా చేస్తామన్నారు.
సీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన ఘనుడు జగన్- వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు - Prajagalam Sabha
రాయలసీమకు వైఎస్సార్సీపీ నాయకులు ఏమైనా చేశారా? ప్రాజెక్టులు కట్టారా? రోడ్లు వేశారా? పరిశ్రమలు తెచ్చారా? ఏమీ చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలి అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారులకు రూ.700 కోట్లు ఖర్చు పెట్టారని, ప్రకటనల కోసం సాక్షి మీడియాకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. పార్టీ రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టిన సైకోకు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో వేసుకున్నారన్న చంద్రబాబు మీ భూములను జగన్ పేరుతో రాసుకుంటున్నారని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేసే యత్నం జరుగుతోందని తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి భూమి రికార్డులు ఉన్నా ఇతరుల పేరిట మార్చారని ఇటీవల చేనేతకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అతడి ఆత్మహత్య కారణంగా కుటుంబసభ్యులూ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్ల బకాయిలు పెట్టిన జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తామని సర్వనాశనం చేశారు, వ్యవసాయాన్ని పూర్తిగా చంపేశారు, రైతు మెడ నొక్కారు.. దిక్కుతోచని స్థితిలో రైతులు, రైతు కూలీలు ఉన్నారని ఆందోళన వ్యక్తే చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తెలుగుదేశం పార్టీ మార్చిందని చెప్తూ జగన్ సీఎం అయ్యాక ఇతర పంటలు ఏమైనా వచ్చాయా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఫట్ - కూటమి సూపర్ సిక్స్ బ్లాక్ బస్టర్ హిట్: చంద్రబాబు - CHANDRABABU ON YSRCP MANIFESTO