T BJP Chief Kishan Reddy Press Meet : త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపకల్పనకు రేపటి(బుధవారం) నుంచి సలహాలు స్వీకరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) సభలు సూపర్ సక్సెస్ అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల రెండు డిజిటల్ క్యాంపైన్ ప్రచార రథాలను(BJP Digital Campaign Vehicles) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మరోవైపు వీడియో వ్యాన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని ఎందుకు అన్నారో వెళ్లి ఆయననే అడగండి అని సూచించారు. పెద్దన్న అన్నంత మాత్రాన కాంగ్రెస్ బీజేపీ(BJP) ఒక్కటి అయినట్లా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4వేల పింఛన్లపై సమాధానం చెప్పాలన్నారు. ప్రజలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాన్ని మొదలు పెడతామని తెలిపారు.
"ఆరు గ్యారంటీలు ఇచ్చారు. ఇంతవరకు గ్యారంటీల విషయంలో ఏరకంగా అమలు చేస్తారు. ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఇంతవరకు తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోయారు. వాళ్లలో కూడా క్లారిటీ లేదు. ఆరు గ్యారంటీల అమలు ఇప్పటివరకు పేపర్‌కు మాత్రమే పరిమితం అయింది. ఈ గ్యారంటీల వల్ల లాభం ఎంత వచ్చిందో తెలియదు కానీ ప్రచారానికి భారీగానే ఖర్చు అవుతుంది. ఈ గ్యారంటీల అమలు కోసం ప్రశ్నించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
'కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు - ప్రభుత్వం మారినా పాలనలో మార్పు లేదు'
Kishan Reddy Launch Two Digital Campaign Vehicles :ఈ రెండు డిజిటల్ క్యాంపైన్ ప్రచార రథాల్లో మొదటిదీ 'మన మోదీ' దేశానికి, తెలంగాణకు ఏ రకంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నటు వంటి మోదీ అన్నది దీని ఉద్దేశ్యమని కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. అలాగే వీటి ద్వారా తెలంగాణలో 2014 వరకు మౌలిక వసతులు ఏ రకంగా ఉండేవి, 2014 తర్వాత ఏ రకంగా ముందుకు వెళుతున్నాయనేది ప్రజలకు తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగిన ప్రధాని మోదీనే స్వయంగా ఐదేళ్ల నుంచి తెలంగాణకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలు అన్నింటినీ ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి డిజిటల్ క్యాంపైన్ అనే కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని సూచించారు.
ప్రశ్నిస్తున్న తెలంగాణ : రెండో డిజిటల్ క్యాంపైన్ 'ప్రశ్నిస్తున్న తెలంగాణ' ప్రచార రథంగా నామకరణం చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆరు గ్యారంటీలను ఇచ్చారని ఇంతవరకు గ్యారంటీలను ఏ రకంగా అమలు చేస్తారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాల వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో తెలియడం లేదు కానీ పెద్ద ఎత్తున ప్రచారానికి డబ్బులు కేటాయిస్తున్నారన్నారు. ఈ పథకాల విషయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ద్వారా ప్రశ్నించే కార్యక్రమం ఇదని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రధానిని సీఎం రేవంత్ పెద్దన్న అని ఎందుకు అన్నారో ఆయన్నే అడగండి : కిషన్ రెడ్డి వారసత్వ నేతల అవినీతిని వెలికితీస్తున్నా - అందుకే వారికి భయం పట్టుకుంది : మోదీ
రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - దక్షిణ భారత్‌కు తెలంగాణ గేట్‌వేలా నిలుస్తుంది : మోదీ